ఈవీఎంలపై అనుమానాలు నివృత్తి చేయాలి: ఉషశ్రీ చరణ్‌ | EVMs Row: Ex Minister Usha Sri Charan Comments On EVMs | Sakshi
Sakshi News home page

ఈవీఎంలపై అనుమానాలు నివృత్తి చేయాలి: ఉషశ్రీ చరణ్‌

Published Tue, Jun 18 2024 5:52 PM | Last Updated on Tue, Jun 18 2024 6:52 PM

Ex Minister Usha Sri Charan Comments On Evms

సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: దేశ వ్యాప్తంగా ఈవీఎం పై చర్చ జరగాల్సిన ఆవశ్యకత ఉందని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్‌ అన్నారు. మంగళవారం ఆమె పెనుకొండలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఈవీఎంల పనితీరుపై వస్తున్న అనుమానాలను నివృత్తి చేయాలన్నారు. 

పచ్చబిళ్ళ వేసుకుని ప్రభుత్వ కార్యాలయాల్లోకి వెళ్ళండి, పని చేయని అధికారుల భరతం పడతామంటూ అచ్చెన్నాయుడు వాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని కించపరిచేలా ఉన్నాయని మండిపడ్డారు. అన్ని పార్టీల వారికి సమానంగా సంక్షేమ పథకాలు అందించిన మహోన్నత వ్యక్తి వైఎస్‌ జగన్‌ అని ఉషశ్రీ చరణ్‌ అన్నారు.

వైఎస్‌ జగన్‌కు జెడ్‌ప్లస్‌ సెక్యూరిటీ ఇవ్వాలి: రవిచంద్రారెడ్డి
విజయవాడ: ఎన్డీఏ ప్రభుత్వంలో అధికార వివక్ష స్టార్ట్‌ అయ్యిందని వైఎస్సార్‌సీపీ నేత రవిచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొంతమంది అధికారులను టార్గెట్‌ చేసి వేధిస్తున్నారన్నారు. డిప్యూటేషన్‌పై వచ్చిన అధికారులను కక్ష కట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. అధికారం మారగానే అధికారులను వేధించడం సరికాదు. వైఎస్‌ జగన్‌కు సెక్యూరిటీ తగ్గించడమేంటి?. వీఐపీలు ఉన్న మార్గాల్లో చెక్‌పోస్టులు పెట్టడం సహజమే. జగన్‌కు చెడు చేయాలని ఎన్డీఏ ప్రభుత్వం చూస్తోంది. వైఎస్‌ జగన్‌కు జెడ్‌ప్లస్‌ సెక్యూరిటీ ఇవ్వాలి’’ అని రవిచంద్రారెడ్డి అన్నారు.

 

 

 

 

 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement