‘చంద్రబాబు సూపర్‌ సిక్స్‌ కాదు.. సూపర్‌ షాక్‌లిచ్చారు’ | Ex Minister Kurasala Kannababu Slams On Chandrababu | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు సూపర్‌ సిక్స్‌ కాదు.. సూపర్‌ షాక్‌లిచ్చారు’

Dec 27 2024 6:00 PM | Updated on Dec 27 2024 6:32 PM

Ex Minister Kurasala Kannababu Slams On Chandrababu

గత ఏడు నెలలుగా చంద్రబాబు ప్రజలకు షాక్ ఇస్తున్నారని.. ఆరోగ్యశ్రీ ఉందా? లేదా? అనే పరిస్ధితికి తీసుకువచ్చారంటూ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు మండిపడ్డారు.

సాక్షి, కాకినాడ: గత ఏడు నెలలుగా చంద్రబాబు ప్రజలకు షాక్ ఇస్తున్నారని.. ఆరోగ్యశ్రీ ఉందా? లేదా? అనే పరిస్ధితికి తీసుకువచ్చారంటూ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రిలో ఇన్సులిన్‌ కూడా లేని పరిస్ధితి ఉందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్నారని.. కొందర్ని తొలగించారని కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సూపర్ సిక్స్ కాదు.. సూపర్ షాక్ అన్నట్లుగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. భుజాలపై మోసే సొంత మీడియా ఉండడమే చంద్రబాబు అదృష్టం. పేరులో ఉచితం తప్పా.. ఉచిత ఇసుక ఎక్కడా?. చంద్రబాబుకు ఇస్తున్న షాకులకు ఎవరూ మినహయింపు కాదు. బాబు వస్తే తమకు స్వర్గం అనుకున్న మద్యం ప్రియులకు కూడా షాక్ ఇచ్చారు’’ అని కన్నబాబు దుయ్యబట్టారు.

‘‘ఉత్తరాంధ్ర నుండి రాయలసీమ వరకు ఇవాళ వైఎస్సార్‌సీపీ పోరుబాట దిగ్విజయంగా జరిగింది. విద్యుత్ భారం, మూడు డిమాండ్లను అధికారులకు వినతిపత్రం ద్వారా అందించాం. ఒక్క నెలలోనే ఆరు వేల కోట్లు విద్యుత్ ఛార్జీల రూపంలో వసూలు చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇంకా ఎంత కాలం జగన్ నామ స్మరణం చేస్తారని చంద్రబాబును ప్రశ్నిస్తున్నాను. పచ్చి అబద్దాలను కూటమి ప్రభుత్వం మానిఫెస్టోలో పెట్టింది. చంద్రబాబు సర్కార్‌ ఎన్ని కుట్రలు చేసిన ప్రజల తరఫున వైఎస్సార్‌సీపీ పోరు ఆపదు.’’ అని కన్నబాబు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: కరెంట్‌ కోత.. చార్జీల మోత

‘‘ఉచిత విద్యుత్ అంటే వైఎస్సార్‌ గుర్తుకు వస్తారు. తొమ్మిది గంటల పాటు రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత వైఎస్ జగన్‌ది. రైతుల ఉచిత విద్యుత్ కోసం ఫీడర్లను ఆధునీకరించారు. కూటమి ప్రభుత్వంలో  రైతులకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు తీసుకోవడం లేదు. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు పట్ల ప్రజల ఆగ్రహం బయటకు వచ్చింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హమీలను అమలు చేయాలి’ అని చంద్రబాబు సర్కార్‌ను కురసాల కన్నబాబు డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement