
సాక్షి,వైఎస్సార్: పులివెందులలో డీఎస్పీ మురళీనాయక్ వీరంగం సృష్టించారు. జడ్పీటీసీ ఎన్నికల్లో తమని ఓట్లు వేయనీయడం లేదని, జరుగుతున్న రిగ్గింగ్‌ను ఆపాలంటూ ఓటర్లు పోలీసుకు విజ్ఞప్తి చేసే ప్రయత్నం చేశారు. అయితే, ఆ సమయంలో అక్కడే ఉన్న డీఎస్పీ ఓటర్లపై చిందులు తొక్కారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై బెదిరింపులకు దిగారు. ‘కాల్చిపడేస్తా నా కొడకా.. ఏమనుకుంటున్నావ్. యూనిఫాం ఇక్కడా.’. అంటూ హల్‌చల్ చేశారు.

