‘పార్లమెంట్‌ చీకటి గదిలా మారింది’.. కేంద్రంపై టీఎంసీ ఎంపీ విమర్శలు

Derek OBrien Slams Government Over Parliament Breach References Vajpayee Advani Rule - Sakshi

న్యూఢిల్లీ: తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ  ఎంపీ  డెరెక్‌ ఒబ్రయిన్‌పై కేంద్ర ప్రభుత్వం విమర్మలు గుప్పించారు. పార్లమెంట్‌ భద్రత వైఫల్యంపై  కేంద్ర ప్రభుత్వం మౌనం దాల్చడం వల్ల పార్లమెంట్‌ భవనం.. లోతైన ఒక చికటి గదిలా మారిందని అన్నారు. 2001లో పార్లమెంట్‌ భద్రత వైఫల్యం చోటుచేసుకున్న సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వంలోని ప్రధాన మంత్రి లోక్‌సభలో, హోం మంత్రి రాజ్యసభలో సమాధానం ఇచ్చారని గుర్తుచేశారు. అదే విధంగా అప్పటి ప్రభుత్వం మూడు రోజుల పాటు సూదీర్ఘంగా చర్చ జరిగిపిందని లెలిపారు. 

కానీ.. 2023లో చోటు చేసుకున్న పార్లమెంట్‌ అలజడికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మౌనం వీడలేదని మండిపడ్డారు. అదీకాక, ఈ ఘటనపై చర్చ జరగాలని కోరినందుకు ఏకంగా ఉభయ సభలల్లో 146 మంది ఎంపీని సస్పెండ్‌ చేశారని ధ్వజమెత్తారు. దీనిపై కేంద్ర హోం మంత్రి ప్రకటన చేయలేదని  మండిపడ్డారు. దీంతో పార్లమెంట్‌ భవనం లోతైన చీకటి గదిగా మారిందని అన్నారు. 

డిసెంబర్‌ 13న ఇద్దరు వ్యక్తులు పార్లమెంట్‌ లోపల, మరో ఇద్దరు పార్లమెంట్‌  వెలుపల రంగు గొట్టాలతో పొగ విడుదల చేసి అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై హోం మంత్రి సమాధానం చెప్పాలని ప్రతిక్షాలు పట్టుబట్టగా.. లోక్‌ సభలో 100, రాజ్య సభలో 46 మంది సస్పెండ్‌ అయిన సంగతి తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top