రాష్ట్రాల వ్యవహారాల్లో కేంద్రం జోక్యం వద్దు : టీఎంసీ

Derek Obrien Attend To All Party Meeting In Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాల వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)  గట్టిగా కోరింది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ విధులను తాము నిర్వహించకునే స్వేచ్ఛ ఇవ్వాలిన విజ్ఞప్తి చేసింది. రేపటి నుంచి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభకానున్న నేపథ్యంలో ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించని విషయం తెలిసిందే. ఈసమావేశానికి హాజరైన టీఎంసీ ఎంపీ డెరెక్‌ ఒబ్రెయిన్‌.. అనంతరం మీడియాతో మాట్లాడారు.  

కేంద్ర ప్రభుత్వం జోక్యం లేకుండా తమ విధులను  నిర్వహించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల చెలరేగిన రాజకీయ హింసతోపాటు వైద్యుల సమ్మె వల్ల ఉత్పన్నమైన పరిస్థితుల నేపథ్యంలో టీఎంసీ ఈ వ్యాఖ్యలు చేసింది. నిజమైన సమాఖ్య వ్యవస్థలో, రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మానుకోవాలని ఒబ్రెయిన్‌ అన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తొలి 10 రోజుల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎన్నికల సంస్కరణ చేపట్టాల్సిన అవసరముందుని, దీనిపై అన్ని రాజకీయ పార్టీలు చర్చించాలని పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top