
కర్నూలు జిల్లా: ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన ముఖ్యమంత్రి చంద్రబాబుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ధ్వజమెత్తారు. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల్లో ముందుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ప్రజా ఉద్యమాల ద్వారా నిలదీస్తామన్నారు.
పత్తికొండలో సీపీఐ మహాసభల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రామకృష్ణ మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ అమలు చేయకుండా ఇప్పుడు పీ4 అంటూ ప్రజలను మోసం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించి ఒకవైపు అన్యాయం చేస్తూ.. మరొకవైపు బనకచర్ల ఆనడం పట్ల రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ ఇంజన్ సర్కారు రాష్ట్రాన్ని అప్పుల్లో నిండా ముంచేస్తోందని, జగన్ అప్పులు చేస్తున్నాడని గగ్గోలు పెట్టిన బాబు, ఇప్పుడు ఏం చేస్తున్నట్లు అని రామకృష్ణ ప్రశ్నించారు.