breaking news
k rama krishna
-
‘డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల్లో నిండా ముంచేస్తోంది’
కర్నూలు జిల్లా: ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన ముఖ్యమంత్రి చంద్రబాబుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ధ్వజమెత్తారు. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల్లో ముందుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ప్రజా ఉద్యమాల ద్వారా నిలదీస్తామన్నారు. పత్తికొండలో సీపీఐ మహాసభల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రామకృష్ణ మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ అమలు చేయకుండా ఇప్పుడు పీ4 అంటూ ప్రజలను మోసం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించి ఒకవైపు అన్యాయం చేస్తూ.. మరొకవైపు బనకచర్ల ఆనడం పట్ల రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ ఇంజన్ సర్కారు రాష్ట్రాన్ని అప్పుల్లో నిండా ముంచేస్తోందని, జగన్ అప్పులు చేస్తున్నాడని గగ్గోలు పెట్టిన బాబు, ఇప్పుడు ఏం చేస్తున్నట్లు అని రామకృష్ణ ప్రశ్నించారు. -
‘సీఎం కాన్వాయ్‌లో ప్రమాదం జరిగితే.. బాబుపై కేసు నమోదు చేస్తారా?’
అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయ్యిందని విమర్శించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ. అధికార పార్టీకి పోలీసులు ఊడిగం చేయడం బాధాకరమన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నమోదు చేసిన కేసును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. అసలు వైఎస్ జగన్‌పై కేసు నమోదు చేయడం దారుణమన్నారు. సీఎం కాన్వాయ్‌లో ప్రమాదం .జరిగితే.. చంద్రబాబుపై కేసు నమోదు చేస్తారా? అని ప్రశ్నించారు రామకృష్ణ. ఇక డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్న చంద్రబాబు.. కేంద్రం నుంచి నిధులు ఎందుకు రాబట్టలేకపోతున్నారని నిలదీశారు. ఓ వైపు అప్పులు చేస్తూనే మరో వైపు సంక్షేమ పథకాలకు డబ్బు లేదంటున్నారని చంద్రబాబు పాలనా తీరుపై మండిపడ్డారు రామకృష్ణ.. చంద్రబాబు ప్రభుత్వం కుతంత్రం.. సింగయ్య మృతి ప్రమాదం వక్రీకరణ -
‘సీజ్ ద షిప్ అన్న మీరు.. లారీలను సీజ్ చేయలేకపోతున్నారా?’
విజయవాడ: ఏపీలో రేషన్ కార్డులను రద్దు చేసి నగదు బదిలీ చేస్తారనే వార్తల నేపథ్యంలో సీపీఐ స్పందించింది. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మండిపడ్డారు. ‘రేషన్ కార్డులను రద్దు చేసి నగదు బదిలీ చేస్తామంటున్నారు. బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడం కోసం డబ్బులిస్తామంటున్నారు. బియ్యం షిప్పుల్లో పోయినా.. లారీల్లో పోయినా ప్రభుత్వ పరిధిలోనే కదా జరిగేది. గతంలో పవన్ వెళ్లి సీజ్ ద షిప్ అన్నారు. పవన్ షిప్‌ను సీజ్ చేసినప్పుడు మీరు లారీలను సీజ్ చేయలేకపోతున్నారా?, కోటి 47 లక్షల కార్డులున్నాయంటున్నారు. వరల్డ్ బ్యాంక్ సర్వేలో బిలో ప్రోపర్టీ లైన్(బీపీఎల్) బాగా తగ్గి పోయింది. 5.3 శాతమే ఉందంటున్నారు. 5.3 శాతమే బీపీఎల్ కింద ఉంటే కోటి 47 లక్షల కార్డులు ఎందుకున్నాయ్?, ఆ కార్డులు ఎవరి పేరుతో ఉన్నాయ్ .. ఏ బీరువాలో మూలుగుతున్నాయ్. పక్కాగా మోసం జరుగుతుందని ప్రభుత్వానికి తెలుసు. ఈ మోసంలో ఎవరెవరి ప్రమేయం ఉందో, డబ్బులు వసూలు చేస్తున్నారో ప్రభుత్వం వద్ద సమాచారం ఉంది. దాన్ని అరికట్టలేక మొత్తం అంతా తొలగిస్తామంటున్నారు .మీతీరు ఇంట్లో ఎలకలు పడితే ఇంటికి అగ్గి పెట్టినట్లుంది. ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకుని వారి పై చర్యలు తీసుకోవాలి. అర్హులైన వారికి రేషన్ కార్డు ఇవ్వాలి. బియ్యం అవసరం లేని వర్గాలకు వేరే రకమైన కార్డులు ఇవ్వాలి. రేషన్ బియ్యం తినరు కాబట్టి అమ్ముతున్నారంటున్నారు.తెలంగాణ ప్రభుత్వం మంచి ఆలోచనతో సన్నబియ్యం ఇస్తోంది. జనం క్యూ కట్టి ఆ సన్నబియ్యాన్ని తీసుకుంటున్నారు. మీరు కూడా ప్రజలు తినేందుకు వీలుగా ఉండే బియ్యం ఇవ్వండి. రేషన్ బియ్యం పథకాన్ని కచ్చితంగా కొనసాగించాల్సిందే. పథకం తీసేస్తే నిజమైన లబ్ధిదారులు , పేదవారు నష్టపోతారు. టీడీపీ ప్రభుత్వమే రేషన్ పథకాన్ని తీసేస్తే ఎన్టీ రామారావుకే అన్యాయం చేసినట్లు. ప్రభుత్వం తమ ఆలోచన మార్చుకోకపోతే ప్రజలు తగిన బుద్ధిచెబుతారు’ అని కె రామకృష్ణ ధ్వజమెత్తారు. -
'చంద్రబాబుది నయవంచన దీక్ష'
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ నిప్పులు చెరిగారు. చంద్రబాబుది నవ నిర్మాణ దీక్ష కాదని... నయవంచన దీక్ష అని ఎద్దేవా చేశారు. గురువారం విజయవాడలోని లెనిన్ సెంటర్లో చంద్రబాబు దీక్షకు వ్యతిరేకంగా సీపీఐ నిరసన దీక్ష నిర్వహించింది. ఈ దీక్షలో కె. రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై రామకృష్ణ మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదాపై ప్రతిజ్ఞ చేయించాలని చంద్రబాబును రామకృష్ణ డిమాండ్ చేశారు. కేంద్రంలో ఉంటూనే చంద్రబాబు జనాన్ని మోసం చస్తున్నారు. -
'ఓ పెళ్లికి రెండు సార్లు వెళ్లడం విడ్డూరంగా ఉంది'
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ గురువారం విశాఖపట్నంలో నిప్పులు చెరిగారు. రాష్ట్రం కరువుతో అల్లాడుతుంటే చంద్రబాబు పర్యటించడం మాని... ఓ పెళ్లికి రెండు సార్లు హాజరు కావడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో కరువు నేపథ్యంలో బెంగళూరు, కేరళకు రైతులు వలసలు వెళ్లడంపై సీఎం చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇసుకు మాఫియాపై తన కేబినెట్ మంత్రులు, ఎంపీలకు చంద్రబాబు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. అయితే నిత్యావసర సరుకుల ధరలపై ఆకాశం తాకిన నేపథ్యలో ఈ నెల 9వ తేదీన అన్ని మండల, జిల్లా కేంద్రాల వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పష్టం చేశారు.