'చంద్రబాబుది నయవంచన దీక్ష' | cpi state secretary k rama krishna takes on chandrababu | Sakshi
Sakshi News home page

'చంద్రబాబుది నయవంచన దీక్ష'

Jun 2 2016 11:13 AM | Updated on Aug 13 2018 4:30 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ నిప్పులు చెరిగారు.

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ నిప్పులు చెరిగారు. చంద్రబాబుది నవ నిర్మాణ దీక్ష కాదని... నయవంచన దీక్ష అని ఎద్దేవా చేశారు. గురువారం విజయవాడలోని లెనిన్ సెంటర్లో చంద్రబాబు దీక్షకు వ్యతిరేకంగా సీపీఐ నిరసన దీక్ష నిర్వహించింది. ఈ దీక్షలో కె. రామకృష్ణ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా చంద్రబాబుపై రామకృష్ణ మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదాపై ప్రతిజ్ఞ చేయించాలని చంద్రబాబును రామకృష్ణ డిమాండ్ చేశారు. కేంద్రంలో ఉంటూనే చంద్రబాబు జనాన్ని మోసం చస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement