'ఓ పెళ్లికి రెండు సార్లు వెళ్లడం విడ్డూరంగా ఉంది' | K Rama krishna takes on chandrababu | Sakshi
Sakshi News home page

'ఓ పెళ్లికి రెండు సార్లు వెళ్లడం విడ్డూరంగా ఉంది'

Nov 5 2015 12:05 PM | Updated on Aug 13 2018 4:30 PM

'ఓ పెళ్లికి రెండు సార్లు వెళ్లడం విడ్డూరంగా ఉంది' - Sakshi

'ఓ పెళ్లికి రెండు సార్లు వెళ్లడం విడ్డూరంగా ఉంది'

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ గురువారం విశాఖపట్నంలో నిప్పులు చెరిగారు.

విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ గురువారం విశాఖపట్నంలో నిప్పులు చెరిగారు. రాష్ట్రం కరువుతో అల్లాడుతుంటే చంద్రబాబు పర్యటించడం మాని... ఓ పెళ్లికి రెండు సార్లు హాజరు కావడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో కరువు నేపథ్యంలో బెంగళూరు, కేరళకు రైతులు వలసలు వెళ్లడంపై సీఎం చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

ఇసుకు మాఫియాపై తన కేబినెట్ మంత్రులు, ఎంపీలకు చంద్రబాబు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. అయితే నిత్యావసర సరుకుల ధరలపై ఆకాశం తాకిన నేపథ్యలో ఈ నెల 9వ తేదీన అన్ని మండల, జిల్లా కేంద్రాల వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement