సంజయ్ మనసులో మాట వినండి.. రేవంత్ రెడ్డి ట్వీట్

సాక్షి, హైదరాబాద్: రెండు, మూడు రోజుల్లో మత ఘర్షణలకు రాష్ట్రంలో కుట్రలు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పందించారు. హైదరాబాద్‌లో మత ఘర్షణలపై బండి సంజయ్ తన మనసులో మాట వినండంటూ గురువారం ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
‘ఇదిగో బీజేపీ నైజం... సంజయ్ మనసులో మాట వినండి.. ఏ కుట్రకు ఈ గుసగుసలు.. వీళ్లా నాయకులు?’.. అని ట్వీట్‌లో ప్రశ్నించారు. ఇలాంటి క్రూర సిద్ధాంతాలు గల పార్టీని ఏం చేయాలో తెలంగాణ సమాజమే ఆలోచించాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు.