వసుంధరా రాజేను మెచ్చుకున్న కాంగ్రెస్‌ ఎంపీ | Congress MP Is A Fan Of Vasundhara Raje, Calls Her An Excellent Leader | Sakshi
Sakshi News home page

Rajasthan Politics: వసుంధరా రాజేను మెచ్చుకున్న కాంగ్రెస్‌ ఎంపీ

Jun 13 2024 9:27 AM | Updated on Jun 13 2024 10:49 AM

Congress MP is a Fan of Vasundhara Raje

ఒక పార్టీకి చెందిన నేత మరో పార్టీ నేతను మెచ్చుకుంటే అది ఆసక్తికరంగా మారుతుంది. దీనివెనుక ఏదో పెద్ద కారణమే ఉంటుందని చాలా మంది అనుకుంటారు. సరిగ్గా ఇటువంటిదే రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. ఇప్పుడది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

రాజస్థాన్‌లోని చురు నుంచి కాంగ్రెస్ ఎంపీగా ఎన్నికైన రాహుల్ కశ్వాన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ తాను మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌ మహిళా నేత వసుంధరా రాజేకు వీరాభిమానినని పేర్కొన్నారు. ఆమెను తాను నూటికి నూరు శాతం అభిమానిస్తానని అన్నారు. బీజేపీని వీడిన తర్వాత కూడా తనకు వసుంధర రాజేపై పూర్తి గౌరవం ఉందని అన్నారు. రాజస్థాన్‌లో వసుంధరకు అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని, ఆమె అద్భుతమైన నాయకురాలని పేర్కొన్నారు.

తామంతా వసుంధర నాయకత్వంలో ముందుకు సాగామని, ఆమె రాష్ట్రానికి పలువురు సమర్థవంతమైన నేతలను అందించారని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు తాము వేర్వేరు పార్టీలలో ఉన్నామని, ప్రతిపక్ష ఎంపీగా కేంద్ర ప్రభుత్వంపై పోరాటం సాగిస్తామని రాహుల్‌ తెలిపారు.  ఇదిలావుండగా రాహుల్‌ బీజేపీ నేత రాజేంద్ర రాథోడ్‌ తీరుపై విరుచుకుపడ్డారు.  ఆయన పలువురి రాజకీయ జీవితానికి అడ్డంకిగా మారారని ఆరోపించారు.

తనకు లోక్‌సభ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి టిక్కెట్‌ రాకపోవడానికి రాజేంద్రే కారణమని ఆరోపించారు. రాథోడ్ మొండి వైఖరికి వ్యతిరేకంగా తాను గళం విప్పానన్నారు. కాగా లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌ కశ్వాన్‌కు బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆగ్రహించిన ఆయన బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. తదనంతరం చురు నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement