ఉద్యోగాల కోసం లంచం.. మంచం: ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

Congress Mla Controversial Comments Over Jobs In Karnataka - Sakshi

బెంగళూరు: బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రియాంక ఖర్గే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వారి అర్హత బట్టి కాకుండా లంచం, మంచం ఆధారంగా నియామకంగా జరుగుతోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే యువకులు లంచం ఇవ్వాలి, యువతులు మంచం ఎక్కాల్సి వస్తుందని ఎమ్మెల్యే ప్రియాంక ఖర్గే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

ఖర్గే కలబురిగిలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగాలను అమ్మకాలకు పెట్టారని,  విధానసౌధ వ్యాపారసౌధగా మారిందని ఆరోపించారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తక్షణమే ఆయన మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తుంటే వారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వారిని అవమానించడమేనని అన్నారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్ర స్థాయిలోనూ, కేంద్ర స్థాయిలోనూ ఇలాంటివి జరిగాయని కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై పలు వర్గాల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

చదవండి: Munugode Politics: మాణిక్యం ఠాగూర్‌ ఔట్‌.. ప్రియాంక ఇన్‌..?

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top