10 మందితో కాంగ్రెస్‌ తొలి జాబితా! | Sakshi
Sakshi News home page

10 మందితో కాంగ్రెస్‌ తొలి జాబితా!

Published Fri, Mar 8 2024 3:50 AM

Congress first list with 10 people - Sakshi

ఢిల్లీలో సమావేశమైన  పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ

సర్వేలు, సమీకరణాలు పరిగణనలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపిక

సాక్షి, న్యూఢిల్లీ:వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై తొలి విడత కసరత్తును ఏఐసీసీ అగ్ర నాయకత్వం పూర్తి చేసింది. తెలంగాణలోని సుమారు పది స్థానాలకు అభ్యర్థులను ఫైనల్‌ చేసింది. ప్రాంతీయ, కుల సమీకరణలు, రాజకీయ నేపథ్యం, సర్వేల్లో విజయావకాశాల ఆధారంగా అభ్యర్థులను ఎం­పిక చేసింది. అభ్యర్థుల ప్రకటన ఏక్షణమైనా వెలు వడవచ్చని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి.

పెద్దపల్లిలో గడ్డం వంశీ, మహబూబ్‌నగర్‌లో వంశీచంద్‌రెడ్డి, నిజా మాబాద్‌లో టి.జీవన్‌రెడ్డి, మహబూబాబాద్‌లో బల రాంనాయక్, చేవెళ్లలో సునీత మహేందర్‌రెడ్డి, నల్ల గొండలో రఘువీర్‌రెడ్డి, కరీంనగర్‌లో ప్రవీణ్‌రెడ్డిల పో టీకి ఎవరి నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేక పోవ డంతో వారి అభ్యర్థిత్వాలకు సీఈసీ ఆమోదం తెలిపి నట్లు తెలిసింది. జహీరాబాద్‌ స్థానానికి సురేశ్‌ షెట్కా ర్, ఉజ్వల్‌రెడ్డిల పేర్లను పరిశీలించినట్లు సమాచారం. 

కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు గురువారం సాయంత్రం కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ ఏఐసీసీ కార్యాలయంలో భేటీ అయ్యింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షులు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, అంబికా సోని, తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఈసీ సభ్యుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, ఎన్నికల వ్యూహకర్త సునీల్‌ కనుగోలు తదిత రులు పాల్గొన్నారు.

రాష్ట్రంలోని 17 పార్లమెంట్‌ నియో జ కవర్గాల నుంచి పరిశీలనలోకి వచ్చిన అభ్యర్థుల వివరాలు, స్క్రూటినీ అనంతరం మిగిలిన అభ్యర్థుల వివరాలను సీఈసీ ముందుంచారు. రెండున్నర గంటల పాటు జరిగిన భేటీలో సునీల్‌ కనుగోలు సహా ఏఐసీసీ స్థాయిలో చేసిన సర్వేల నివే దికలు ముందుపెట్టుకొని నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల జాబితాను పరిశీలించారు. మొదటగా సింగిల్‌ పేర్లతో కూడిన స్థానాలను కమిటీ పరిశీలించింది. మొత్తంగా 8–10 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ మేరకు జాబితాను ఏ క్షణమైనా విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. 

మరిన్ని స్థానాలపై చర్చ
మిగతా స్థానాలపై కూడా చర్చించినా, మరోమారు సమావేశమై సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఫైనల్‌ చేద్దామనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. సికింద్రాబాద్‌లో ఇటీవలే పార్టీలో చేరిన బొంతు రామ్మో హన్‌ దంపతులు, నాగర్‌కర్నూల్‌లో మల్లురవి, సంపత్‌ కుమార్, వరంగల్‌లో దారా సాంబయ్య సహా మరో పేరు, మల్కాజిగిరిలో చంద్రశేఖర్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు, మెదక్‌లో మైనంపల్లి హన్మంతరావు, నీలం మధు, ఆదిలాబాద్‌లో ఆదివాసీలైన ఇద్దరి పేర్లపై చర్చి జరిగినట్లు తెలిసింది. ఆయా స్థానాలపై వచ్చే వారంలో తుది నిర్ణయం చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.

Advertisement
 
Advertisement