టీడీపీ ఎమ్మెల్యే బోనాల విజయచంద్రపై కేసు.. ఈ సారి ఏం చేశారంటే? | Case File Against Tdp Mla Bonela Vijaya Chandra | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్యే బోనాల విజయచంద్రపై కేసు.. ఈ సారి ఏం చేశారంటే?

Jun 3 2025 7:51 AM | Updated on Jun 3 2025 7:54 AM

Case File Against Tdp Mla Bonela Vijaya Chandra

సాక్షి,పార్వతీపురం మన్యం: ఏపీలో కూటమి సర్కార్‌ పాలనలో ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారు. తాజాగా పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే బోనాల విజయచంద్రపై మరో మహిళ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మహిళలను అవమానించారంటూ ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.    

గతంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర.. మహిళా ఎంఆర్వోకు అర్ధరాత్రి వాట్సాప్‌ కాల్‌లో అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో, సదరు మహిళా ఎంఆర్వో.. పోలీసులకు ఆశ్రయించారు. అనంతరం, టీడీపీ ఎమ్మెల్యే బోనెల.. బహిరంగంగా బ్లాక్‌మెయిల్‌కు దిగారు. సదరు అధికారి.. ఎస్టీ మహిళ కావడంతో తనపై కేసు నమోదు అవుతుందున్న భయంతో ఎంఆర్వోపై తీవ్ర ఆరోపణలు చేశారు.

ఆయన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర స్పందిస్తూ..‘భూమి విషయమై మాట్లాడేందుకు అర్ధరాత్రి ఎంఆర్వోకు నేను ఫోన్‌ చేశాను. ఆమె ఎత్తకపోవడంతో వాట్సాప్‌ కాల్‌ చేశాను. ఎంఆర్వో ఆఫీసు అవినీతిమయంగా తయారైంది. ఎంఆర్వో మానసిన పరిస్థితి సరిగా లేదు. ఎంఆర్వోపై శాసనసభ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తా. ఆమె క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు.

మరోవైపు... ఎంఆర్వోతో అనుచితంగా మాట్లాడిని ఎమ్మెల్యే తీరుపై ప్రజా సంఘాలుడ మండిపడ్డాయి. ఈ సందర్బంగా సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు స్పందిస్తూ.. మహిళా ఎంఆర్వోకు అర్ధరాత్రి ఎమ్మెల్యే ఫోన్‌ చేయడం సరికాదు. ఆమెను వేధింపులకు గురిచేయడమేంటని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో మరో మహిళ టీడీపీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్రపై ఫిర్యాదు చేయడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement