నాటి తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసేందుకే దీక్షాదివస్: గంగుల | BRS Gangula Kamalakar Key Comments Over Deeksha Divas, More Details Inside | Sakshi
Sakshi News home page

Gangula Kamalakar: నాటి తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసేందుకే దీక్షాదివస్

Nov 28 2024 12:27 PM | Updated on Nov 28 2024 1:09 PM

BRS Gangula Kamalakar Key Comments Over deeksha divas

సాక్షి, కరీంనగర్: రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమాన్ని మరోసారి గుర్తు చేసేందుకే దీక్షాదివస్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. రేపటి దీక్షాదివస్ లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు వివరిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇప్పటికే తిరుగుబాటు మొదలైందని గంగుల కామెంట్స్ చేశారు.

రేపటి దీక్షాదివస్ కోసం కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలం అల్గునూరులో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. కార్యక్రమ ఏర్పాట్లను మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా గంగుల మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణ ఉద్యమాన్ని మరోసారి గుర్తు చేసేందుకే  దీక్షాదివస్ ని నిర్వహిస్తున్నాం. బీఅర్ఎస్ ఆనవాళ్ళు ‌లేకుండా చేస్తామన్న కాంగ్రెస్ నేతలకు కనువిప్పు కలగాలి.

తెలంగాణ అంటేనే సెంటిమెంట్.. ఆ సెంటిమెంట్ ను ఎందుకు మర్చిపోతాం?. రేపటి దీక్షాదివస్ లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు వివరిస్తాం. ఇప్పటికే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. తెలంగాణ తరహా‌ మలిదశ ఉద్యమానికి మరోసారి‌ శ్రీకారం చుట్టబోతున్నాం’ అంటూ కామెంట్స్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement