సొంతింటి కల సాకారమై.. తమ ఇంట్లో తొలి దీపావళి జరుపుకుంటున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాల్లో పండుగ వెలుగులు నిండాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ని లబ్ధిదారుల ఇళ్లలో పండుగ వాతావరణం ఉట్టిపడేలా ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమ పోస్టర్‌ను శనివారం ఆవిష్కరించారు. అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) డి.శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్వో స్వా మి, గృహ నిర్మాణశాఖ ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్ పాల్గొన్నారు.


