● మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్
మానకొండూర్: తెలంగాణాలో ఎల్‌నినోతో కరువు రాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వమే కాళేశ్వరం ప్రాజెక్టుపై లేనిపోని బూచీలు చూపె డుతూ బ్యారేజీలు మరమ్మతు చేయక కరువు సృష్టించిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావుతో కలిసి శనివారం మానకొండూర్‌లో మాట్లాడారు. జూన్, జూలైకల్లా అన్నారం సుందిల్ల బ్యారేజీలను మరమ్మతు చేయాలని సీఎం నిర్ణయం తీసుకోవడం మంచిదేనన్నారు. కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరంతో కేసీఆర్‌కు పేరు ప్రతిష్టలు వస్తాయని, ఆయన్ను బద్నాం చేయాలని ఎన్‌డీఎస్‌ఏ రిపోర్టు పేరిట సీఎం కాలయాపన చేశాడని అరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి ఎన్‌డీఎస్ రిపోర్టు 2024లో ఇవ్వగా రెండేళ్ల తరువాత రిపేరు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడం దుర్మార్గమన్నారు. కేవలం కేసీఆర్‌పై ద్వేషంతోనే జాప్యం చేశారన్నారు. కరువును సృష్టించిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. ఆరు నెలల్లో బ్యారేజీలు ఎలా రిపేరు చేస్తారని ప్రశ్నించారు. నాయకులు సిద్ధం వేణు, తాళ్లపల్లి శేఖర్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, రావుల రమేశ్, నాగిశేఖర్, సర్పంచ్‌లు ఎరుకల శ్రీనివాస్‌గౌడ్, పారునంది కిషన్ పాల్గొన్నారు.


