దేశం వారిని క్షమించదు: బ్రిజ్‌ భూషణ్‌ | Brij Bhushan Singh compares Bhupinder Hooda and his family to Pandavas | Sakshi
Sakshi News home page

దేశం వారిని క్షమించదు: బ్రిజ్‌ భూషణ్‌

Published Sun, Sep 8 2024 2:53 PM | Last Updated on Sun, Sep 8 2024 4:15 PM

Brij Bhushan Singh compares Bhupinder Hooda and his family to Pandavas

ఢిల్లీ: హుడా కుటుంబాన్ని హర్యానా  అక్కా చెల్లెళ్లు అస్సలు క్షమించరని రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ మాజీ అధ్యక్షుడు, బీజేపీ మాజీ ఎంపీ  బ్రిజ్‌ భూషన్‌ అన్నారు. హుడా కుటుంబాన్ని పాండవులతో పేల్చుతూ విమర్శలు గుప్పించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు.

‘‘మహాభారతం సమయంలో ద్రౌపది పణంగా పెట్టి జూదం ఆడి పాండవులు ఓడిపోయారు. దీనికి పాండవులను దేశం ప్రజలు  ఇప్పటికీ క్షమించలేదు. అలాగే హర్యానా అక్కాచెల్లెళ్లు, మహిళల పరువుకు భంగం కలిగించి హుడా కుటుంబాన్ని కూడా భవిష్యత్తులో క్షమించరు. ఈ విషయంలో వారిని ఎప్పుడూ దోషులుగానే చూస్తారు’’ అని  వ్యాఖ్యానించారు. 

ఇటీవల రెజ్లర్లు వినేశ్‌ ఫోగట్, భజరంగ్‌ పూనియాలు కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. అయితే.. రెజ్లర్లు తనపై ఆందోళన చేయడానికి కాంగ్రెస్‌ పార్టీ చేసిన కుట్ర బయటపడిందని శనివారం అన్నారు. రెజ్లర్ల  ఆందోళన వెనకాల  హర్యానా మాజీ సీఎం భూపేందర్‌ హుడా, ఆయన కుమారుడు దీపేందర్‌ హుడా ఉ‍న్నారని మండిపడ్డారు. అదేవిధంగా వినేశ్‌ ఫోగట్‌ ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో నిబంధనలు ఉల్లంఘించినందుకే పతకం చేజారిందని అన్నారు.

మరోవైపు.. బ్రిజ్‌ భూషన్‌ చేసిన వ్యాఖ్యలపై వినేశ్‌ ఫోగట్‌ స్పందించారు. ఆమె ఆదివారం జులనా నియోజకవర్గంలో  ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా  వినేశ్‌ మాట్లాడుతూ.. “నేను రెజ్లింగ్‌లో ఏది గెలిచినా అది ప్రజల వల్లనే గెలిచాను. రాజకీయాల్లోనూ విజయం సాధిస్తానని ఆశిస్తున్నా. జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసన గురించి తర్వాత మాట్లాడుతా. బ్రిజ్ భూషణ్ ఏం దేశం కాదు.. ప్రజలు నాతో ఉన్నారు. వారు నా స్వంతం. ప్రజలే నన్ను ఆదరించారు. అన్ని పోటీల్లో విజయం సాధిస్తా.  పతకం రాలేదన్న బాధ భారత్‌లోని ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తర్వాత తగ్గింది. ఎన్ని  సవాళ్లు అయినా ఎదుర్కొంటున్నా’ అని  అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement