
సాక్షి,విశాఖ: టీడీపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతన్నకు కష్టాలే. వ్యవసాయం అంటే దండగన్న చంద్రబాబు రైతన్నను ఆదుకోకుండా వారిపై పగబడుతున్నారని కూటమి ప్రభుత్వంపై మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు
కూటమి ప్రభుత్వంలో రైతన్నల దుస్థితిపై బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. టీడీపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతులకు ఇబ్బందులు తప్పవు. ప్రభుత్వం అయినా రైతుల కష్టాలను తీర్చేలా ఉంటే బాగున్ను..అది రాష్ట్రంలో లేదు.. టీడీపీ ప్రభుత్వం వస్తే ప్రకృతి కూడా రైతులకు అనుకూలంగా ఉండదు. కడపలో అరటి తోటలు గాలికి నేలకొరిగాయి.పండిన పంటకి గిట్టుబాటు ధర లేదు.
మిర్చి పరిస్థితి కూడా అలానే ఉంది ఏం చెయ్యాలో తోచని దుస్థితి.చెరకు రైతులు స్వయంగా పంటను వాళ్ళే కాల్చుకునే పరిస్థితి. ఈ ప్రభుత్వం వ్యవసాయాన్ని, రైతులను ఎందుకు చిన్నచూపు చూస్తుంది. మిర్చి కొంటాం అని హామీ ఇచ్చారు. ఒక్క క్వింటా అయినా కొన్నారా..?.ఒక్క కేజీ అయినా కొన్నారా? కొంటే రైతులు యార్డ్ దగ్గర ఎందుకు ఉంటారు.
గోవాడ చెరకు రైతులకు రూ.24 కోట్లు బకాయి పడ్డారు. ఎందుకు రైతులకు చెల్లించడం లేదు. వ్యవసాయం అంటే దండగ అని టీడీపీ నానుడి. ఏ రకంగా చూసినా గత ప్రభుత్వంలో రైతులకు మంచి చేశాం.
మా హయాంలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. రైతులకు మాటలే తప్ప చేసినది ఏమి లేదు.గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి వెళ్తే పరిస్థితి తెలుస్తుంది. మేము చెప్పింది అబద్దం అయితే అక్కడికి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. హామీలు ఇవ్వడం కాదు చేతల్లో చూపించండి. కూటమి హామీలు చూసి ప్రజలు మోసపోయారు..హామీలు నమ్మి మోసపోయామని ప్రజలకు కూడా అర్థమైంది.ఇక్కడ పండిన పంటకు ఇతర ప్రాంతాల్లో మార్కెటింగ్ చేయొచ్చు కదా.
రైతులను ఆదుకోవాలనే తపన ఈ ప్రభుత్వానికి లేదు.రైతుల ఇబ్బందులను ఈ పరిణామాలను తీవ్రంగా ఖండిస్తున్నాను. రైతులను వెంటనే ఆదుకోవాలి.రైతులకు ఇచ్చిన హామీలను మాటల్లో కాదు చేతల్లో చూపించాలి’ అని డిమాండ్ చేశారు.