విపక్ష సభ్యులను కించపరచడమే కూటమి నేతల పనా?: బొత్స | Botsa Satyanarayana Fires On Chandrababu Government | Sakshi
Sakshi News home page

విపక్ష సభ్యులను కించపరచడమే ‘కూటమి సర్కార్‌’ పనా?: బొత్స

Mar 13 2025 3:21 PM | Updated on Mar 13 2025 3:23 PM

Botsa Satyanarayana Fires On Chandrababu Government

శాసనమండలిలో ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానాలు రావడం లేదని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.

సాక్షి, అమరావతి: శాసనమండలిలో ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానాలు రావడం లేదని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గురువారం ఆయన శాసనమండలి మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. మంత్రులు చెప్పిందే చెప్తుతున్నారని.. కూటమి ప్రభుత్వానికి నిర్ధిష్టమైన ఆలోచన లేదని దుయ్యబట్టారు. 2019-24 మధ్య స్కామ్‌లు జరిగితే ఎంక్వైరీ వేసుకోమని చెప్పాం. మేం 2014 నుంచి మాట్లాడాలని అడిగాం. సభలో అభ్యంతరకరమైన భాష మాట్లాడుతున్నారు’’ అని బొత్స ధ్వజమెత్తారు.

‘‘వైజాగ్ భూముల సిట్ రిపోర్ట్ బయటపెట్టమని కోరాం. విపక్ష సభ్యులను కించపరచడమే పనిగా పెట్టుకున్నారు. ఈ ప్రభుత్వానికి నిర్ధిష్టమైన విధానం లేదు. డిజిటల్ కరెన్సీ అనేది మ్యాండేట్ కాదు. ఇప్పుడు జరుగుతున్న లిక్కర్ సేల్స్ డిజిటల్ కరెన్సీలోనే నడుస్తున్నాయా? సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడటం సరికాదు. ప్రత్యేకించి వైఎస్‌ జగన్‌ పేరు ప్రస్తావించడంపై మేం అభ్యంతరం తెలిపాం. మా మీద, మా నాయకుల మీద నిరాధార ఆరోపణలు చేస్తున్నారు’’ అని బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement