సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూషను నియమించారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కమిటీలో నియామకాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర కమిటీలో వివిధ హోదాల్లో నియామకాలు చేశారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గానికి చెందిన పైలా సన్యాసిరాజును స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్(ఎస్‌ఈసీ) మెంబర్‌గా నియమించారు. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గానికి చెందిన వెంపడ శ్రీనివాసరెడ్డిని స్టేట్ సెక్రటరీ(పార్లమెంట్)గా నియమించారు.
ఇదీ చదవండి: వైఎస్సార్‌సీపీలోకి ప్రముఖ వ్యాపారవేత్త


