కొడాలి నాని సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన బొప్పన రామచంద్రరావు
ఎన్టీఆర్ జిల్లా: మాజీ మంత్రి కొడాలి నాని సమక్షంలో ప్రముఖ వ్యాపారవేత్త బొప్పన రామచంద్రరావు శుక్రవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆయనతో పాటు ఎన్టీఆర్ జిల్లా గుడ్లవల్లేరు మండలం పెంజండ్ర గ్రామానికి చెందిన పలువురు యువకులు పార్టీలో చేరారు. పుట్టినరోజు నాడు పార్టీలో చేరిన రామచంద్రరావుకు కొడాలి నాని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ గుడ్లవల్లేరు మండల అధ్యక్షుడు శాయన రవి, పట్టణాధ్యక్షుడు గొర్ల శ్రీను తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: భీమిలి సమన్వయకర్తగా బొత్స అనూష


