కేంద్ర మంత్రికి బీజేపీ షోకాజ్‌ నోటీసులు | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రికి బీజేపీ షోకాజ్‌ నోటీసులు

Published Tue, May 21 2024 8:01 AM

BJP Sends Show Cause Notice To MP Jayant Sinha

రాంచీ: లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్ర మంత్రి జయంత్‌ సిన్హాపై బీజేపీ చర్యలు తీసుకుంది. ఆయన జార్ఖండ్‌లోని హజారీబాగ్ స్థానం నుంచి మనీష్ జైస్వాల్‌ను అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి.. పార్టీపరమైన సంస్థాతగ పనులు, ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదని జార్ఖండ్‌ బీజేపీ జనరల్‌ సెక్రటరీ ఆదిత్య సాహూ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. 

మరోవైపు.. సోమవారం జరిగిన ఐదో విడత పోలింగ్‌లో జయంత్‌ సిన్హా తన  ఓటు హక్కు వినియోగించుకోకపోవటంతో బీజేపీ అధిష్టానం ఆగ్రహించి ఆయనపై చర్యలకు పూనుకుందని పార్టీలో చర్చ జరుగుతోంది. మార్చిలో జయంత్‌ సిన్హా.. తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయవద్దని నిర్ణయం  తీసుకున్నట్లు వెళ్లడించిన విషయం తెలిసిందే.

‘‘లోక్‌సభ  ఎన్నికల్లో భాగం పార్టీ అధిష్ణానం హజారీబాగ్‌లో మనీష్‌ జైశ్వాల్‌ను  అభ్యర్థిగా ప్రకటించింది. అప్పటి నుంచి మీరు( జయంత్‌ సిన్హా) పార్టీ సంస్థాగత పనులు, ఎన్నికల ప్రచారానికి సైతం దూరంగా ఉన్నారు. కనీసం పోలింగ్‌లో ఓటు  కూడా వేయలేదు. మీ ప్రవర్తనతో బీజేపీ ప్రతిష్ట దెబ్బతింటోంది’’ అని నోటీసులో ఆదిత్య సాహు పేర్కొన్నారు. అదే విధంగా రెండు రోజుల్లో  వివరణ ఇవ్వాలని బీజేపీ కోరింది. అయితే ఇప్పటివరకు ఈ నోటీసుకుల స్పందించకపోవటం గమనార్హం.

మర్చి 2న జయంత్‌ సిన్హా.. తనను ప్రత్యక్ష ఎన్నికల విధుల నుంచి తప్పించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. భారత్‌, ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ మార్పులను ఎదుర్కొవడానికి తన వంతుగా కృషి  చేయటంపై దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. 

దీంతో ఆయన ప్రాతినిధ్యం వహించిన హజారీబాగ్‌ స్థానంలో బీజేపీ అధిష్టానం మనీష్‌ జైశ్వాల్‌ను బరిలోకి దించింది. అయితే ఈసారి ఎన్నికల్లో హజారీబాగ్‌ స్థానంలో జయంత్ సిన్హాకు మరోసారి టికెట్‌  ఇవ్వకుండా పక్కనపెట్టాలని బీజేపీ భావించిందని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

Advertisement
 
Advertisement
 
Advertisement