సీఎం జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి చేరికలు | BJP And TDP Leaders joined YSRCP Annamayya District | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి చేరికలు

Apr 2 2024 12:01 PM | Updated on Apr 2 2024 3:36 PM

BJP And TDP Leaders joined YSRCP Annamayya District - Sakshi

సాక్షి, అన్నమయ్య: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఆరో రోజు అన్నమయ్య జిల్లాలో కొనసాగుతోంది. ఇవాళ సీఎం జగన్‌ బస్సు యాత్ర చీకటిమనిపెల్లెలో ప్రారంభమైంది. ఈ క్రమంలో చీకటిమనిపల్లె స్టే పాయింట్‌ వద్ద సీఎం జగన్‌ సమక్షంలో పలువురు నేతలు వైఎస్సార్‌సీపీలో చేరారు. వారికి సీఎం జగన్‌ కండువా కప్పి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు.

బీజేపీ సీనియర్‌ నేత, రాజంపేట జిల్లా మాజీ అధ్యక్షుడు, ఆప్నా స్టేట్ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ ఏవీ సుబ్బారెడ్డి, మదనపల్లె టీడీపీ మైనార్టీ నేత మొబసిర్‌ అహ్మద్‌, కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలానికి చెందిన టీడీపీ సీనియర్‌ నేత ఎం.గంగాధర్‌ వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement