హైదరాబాద్: రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ సర్కారు విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించిందని బీజేఎల్పీ నేత మహఏశ్వర్‌రెడ్డి విమర్శించారు. అధికారంలోకి రాగానే రీయింబర్స్‌మెంట్ ఇస్తానన్న రేవంత్.. అది మరచి ఎలా దోచుకోవాలో చూస్తున్నారని మండిపడ్డారు. ఫీజు బకాయిలపై ఈనెల 24, 25 తేదీల్లో దీక్షలు చేస్తామని ఏలేటి హెచ్చరించారు. ఇక 22-ఏ బాధితులకు బీజేపీ అండగా ఉంటుందన్నారు ఏలేటి.
ఈరోజు(శనివారం, ఆగస్టు 22వ తేదీ) ‘ఫీజుల బకాయి.. బీజేపీ లడాయి’ పోస్టర్‌ను బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆవిష్కరించిన ఏలేటి మహేశ్వర్‌రెడ్డి.. మాట్లాడారు. ‘ విద్యార్థుల ఫీజు బకాయిల గురించి విద్యార్థుల సంతకాల సేకరణ, ఉద్యమాలు చేస్తుంది బీజేపీ. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడు. పాఠశాలల్లో, యూనివర్సిటీలలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే సీఎం విదేశీ పర్యటనలు చేస్తున్నారు.
21 వేల 126 బడులు శిథిలావస్తలో ఉన్నాయి. బంగారం అమ్ముకుని చదువులు చెప్పిస్తుంటే..ప్రభుత్వానికి పట్టడం లేదు. పీసీసీగా నువ్వు మాట్లాడిన మాటలేవి రేవంత్ రెడ్డి..?, రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. 24, 25 తేదీలలో రెండు రోజుల పాటు రాష్ట్ర కార్యాలయం ముందు రాంచందర్ రావు ఆధ్వర్యంలో దీక్ష చేస్తాం. ప్రజల కోసం ప్రభుత్వం మెడలు వంచుతాం’ అని హెచ్చరించారు.
ఇదీ చదవండి:
చిట్టక్క పంచాయితీ.. కొండా మురళి రియాక్షన్‌పై ఉత్కంఠ


