వదిన-మరదళ్ల సమరం : ‘బారామతి నేను.. నేను బారామతి’ని

Baramati Is Me, I Am Baramati Said Supriya Sule - Sakshi

ముంబై : మహారాష్ట్రలో సార్వత్రిక ఎన్నికల పోరులో వదిన-మరదళ్ల సమరం ఆసక్తిని రేపుతోంది. అజిత్ పవార్ తిరుగుబాటుతో రెండు ముక్కలైన ఎన్‌సీపీకి కంచుకోటగా ఉన్న బారామతి లోక్‌సభ స్థానం నుంచి శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ బరిలో నిలిచారు. 

వారిలో సుప్రియా సూలే తరుపున ఎన్నికల ప్రచారం చేస్తున్న శరద్‌ పవర్‌ ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తుంటే.. భార్య సునేత్ర పవార్‌ తరుపున అజిత్‌ పవార్‌ ప్రచారంతో ప్రజా మద్దతు తమకే ఉందని నిరూపించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. 

‘బారామతి అంటే నేను.. నేనే బారామతి’
ఈ తరుణంలో శరద్‌ పవార్‌ కుమార్తె సుప్రియా సూలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, ఏ వ్యక్తికి వ్యతిరేకంగా కాదని చెప్పారు. అంతేకాదు తాను బారామతిలో పుట్టి పెరిగానని, దాని మట్టితో కనెక్ట్ అయ్యానని అన్నారు. ‘బారామతి అంటే నేను.. నేనే బారామతి’ అని పేర్కొన్నారు. 
  
శరద్ పవార్‌ అంతం కోసం
ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల్ని ‘ప్రతీకార పోరాటం’గా మార్చారంటూ సుప్రియా సూలే మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్‌పై మండిపడ్డారు. పాటిల్ గత వారం బారామతికి వచ్చి ఈ యుద్ధం శరద్ పవార్‌ను అంతం చేయడం కోసమే అని వ్యాఖ్యానించారు. అభివృద్ది గురించి మాట్లాడితే ప్రజలు ఇష్టపడతారు. ఇలా మాట్లాడితే ఎలా? ఈ తరహా వ్యాఖ్యలతో పాటిల్‌ వ్యక్తిగత ఎన్నికలుగా మార్చారని చెప్పుకొచ్చారు.  

బారామతి మట్టికి రుణపడి ఉంటాం. 
2009 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బారామతి సీటుతో తనకు ఉన్న అనుబంధం గురించి అడిగిన ప్రశ్నకు సులే మాట్లాడుతూ.. ‘బారామతి నేను, నేను బారామతిని.నేను ఇక్కడే పుట్టి పెరిగాను. ఈ రోజు నేను, నా కుటుంబం అంతా బారామతి మట్టికి రుణపడి ఉంటామని  భావోద్వేగానికి గురయ్యారు. 

నా అనుకున్న వాళ్లు దూరమైతే 
అజిత్‌ పవార్‌ అభ్యర్ధిగా బరిలో దిగడంపై.. మన అనుకున్నవాళ్లు దూరమైనప్పుడు బాధగానే ఉంటుంది. నాక్కూడా అలాగే ఉంది. నేను బంధాలు, వ్యక్తులకు విలువ ఇస‍్తాను. కానీ నేను చేస్తున్న ఈ రాజకీయాలు మాత్రం కుటుంబం కోసం ప్రజలకు సేవ చేయడం కోసమేనంటూ ఎన్నికల ప్రచారంలో వడివడిగా అడుగులు ముందుకు వేశారు.  

Election 2024

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top