పవన్‌ ఫ్లాప్‌.. చంద్రబాబు జిమ్మిక్కే! | AP Minister Ambati Rambabu Satirical Comments On Pawan Kalyan Varahi 4 Yatra - Sakshi
Sakshi News home page

పవన్‌ వారాహి అట్టర్‌ఫ్లాప్‌.. ఇదంతా చంద్రబాబు జిమ్మిక్కే!

Oct 2 2023 12:47 PM | Updated on Oct 2 2023 6:59 PM

AP Minister Ambati Reacts Pawan Varahi 4 Yatra - Sakshi

కొండనాలికకు మందేస్తే.. ఉన్ననాలిక ఊడిందన్న చందాన వారాహి యాత్ర.. 

సాక్షి, గుంటూరు:  ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు తర్వాత అనైతిక వ్యక్తి పవన్‌ కల్యాణేనని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. చంద్రబాబుతో కలిసొస్తే ఆదరణ ఉండదనే విషయం వారాహి యాత్ర ఫ్లాప్‌తో పవన్‌కు ఇప్పుడు అర్థమైందని అంబటి తెలిపారు. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. జనసేన చీఫ్‌ తీరుపై మండిపడ్డారు. 

కొండనాలికకు మందేస్తే.. ఉన్ననాలిక ఊడిందన్న చందాన వారాహి యాత్ర తయారైంది. చంద్రబాబుతో కలిసి వస్తున్నానని చెప్పగానే వారాహి-4 యాత్ర ఫ్లాప్‌ అయ్యింది. కాపులు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లి పవన్‌ సభలు పెడుతున్నారు. ఇదంతా నక్కజిత్తుల చంద్రబాబు జిమ్మిక్కు. పవన్‌ సభలకు వెళ్లండి అని లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. కానీ, సాయంత్రం ఆరు గంటలైనా జనం పవన్‌ సభకు రాలేదు. చంద్రబాబుతో పొత్తును ప్రజలు ఛీ కొట్టారు. బీజేపీతో ఉన్నాను అంటావ్‌.. టీడీపీతో వెళ్తాను అంటావ్‌. బీజేపీతో పొత్తులో ఉంటూనే టీడీపీతో కలిసేందుకు సిగ్గు లేదా? అని పవన్‌ను అంబటి ప్రశ్నించారు. 

పవన్‌ ఏం చెబుతారో అని ప్రజలంతా ఎదురు చూశారు. కానీ, జైలుకెళ్లి చంద్రబాబును పరామర్శించి పొత్తు పెట్టుకున్నారు. పవన్‌ చంద్రబాబును వాడుకుంటున్నారు. చంద్రబాబుతో పొత్తు ప్రకటన తర్వాత పవన్‌ బాడీలాంగ్వేజ్‌ మారిపోయింది. రాజకీయాలకు పనికి రాని వ్యక్తి.. చంద్రబాబు చెప్పులు మోసిన వ్యక్తి పవన్‌ కల్యాణ్‌. 

జనసేన కార్యకర్తలు ఇక జనసైనికులు కాదు.. సైకిల్‌సైనికులు. సైకిల్‌కు తప్పు పట్టింది.. టైర్లు లేవు. చంద్రబాబు అవినీతి డబ్బుతో వారాహి యాత్ర జరుగుతోంది. జనసేన అవినీతి జెండా కూడా చంద్రబాబు అవినీతి డబ్బుతోనే ఎదుగుతోంది. ‘‘సర్వనాశనం అయిపోయిన టీడీపీని బతికించాలనుకుంటున్నావ్‌. బందర్‌ సభలోనైనా నీ క్యాడర్‌కు ఓ క్లారిటీ ఇవ్వు. బీజేపీతో ఉన్నావో లేదో నీ క్యాడర్‌కైనా చెప్పు’’ అని పవన్‌ను ఉద్దేశించి అంబటి అన్నారు. ఈసారి తప్పు జరిగితే ఊరుకోనంటూ పవన్‌ మాటలు చెబుతున్నాడు. మరి 2014 టీడీపీ అరాచకాలను ఎందుకు ప్రశ్నించలేదు అని అంబటి ప్రశ్నించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement