
సాక్షి,నెల్లూరు: వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలంటే కూటమికి భయమెందుకు? అని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన వేళ చంద్రబాబు సర్కార్ విధిస్తున్న ఆంక్షలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్ జగన్ పర్యటనలంటే కూటమికి భయమెందుకు?. జగన్‌కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకపోతున్నారు. కూటమి సర్కార్ ప్రజల సంక్షేమాన్ని ఎప్పుడో వదిలేసింది.
ప్రజలను వదిలేసి సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు పోరాటాలు కొత్త కాదు. రేపు నెల్లూరు జిల్లా నలుమూలల నుంచి జనం తరలి వస్తారు. ప్రజాభిమానాన్ని ఆపాలంటే కొత్త జైళ్లు కట్టుకోండి. ప్రజల హక్కులను కాలరాసే అధికారం పోలీసులకు లేదు. నాయకుడికి మద్దతు తెలపడం ప్రజల హక్కు. ఇబ్బంది పెట్టినవారెవరనీ వదిలి పెట్టే ప్రసక్తే లేదు’ అని స్పష్టం చేశారు.