ప్రతిపక్షం ఉన్నట్లు బాబు భ్రమ కల్పిస్తున్నారు: అంబటి

Ambati Rambabu Slams On Chandrababu Naidu In Tadepalli - Sakshi

సాక్షి, తాడేపల్లి: దళితులపై దౌర్జన్యం చేస్తే ఎంతటి వారినైనా ప్రభుత్వం ఊపేక్షించదని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. దళితులపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారని తెలిపారు. చంద్రబాబు హైదరాబాద్‌లో ఉండి జూమ్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బాబును ప్రజలు మరిచిపోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు దుష్ట రాజకీయాలకు ఎల్లో మీడియా వత్తాసు పలుకుతోందని దుయ్యబట్టారు. ప్రతిపక్షం ఉన్నట్లు చంద్రబాబు భ్రమ కల్పిస్తున్నారని తెలిపారు. ఏ రాష్ట్రంలో చేయని సంక్షేమ కార్యక్రమాలు ఏపీలో అమలవుతున్నాయని పేర్కొన్నారు. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ప్రభుత్వం రూ.4వేల కోట్లు ఆదా చేసిందని చెప్పారు. (‘కుల రాజకీయాలు చేస్తే సహించం’)

సీఎం జగన్ చేస్తున్న సంక్షేమాన్ని ఎల్లో మీడియాలో ప్రచురించదని, కానీ బాబు కుట్ర రాజకీయాలను మాత్రం హైలెట్ చేస్తారని అంబటి విరుచుకుపడ్డారు. చంద్రబాబు, ఎల్లో మీడియా కలిసి ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. అక్రమ మైనింగ్‌ జరుగుతుందనడం అవాస్తవమని స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి విచారణకైనా సిద్ధమని చెప్పారు. ఎల్లో మీడియా ద్వారా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తనపై దురుద్దేశంతో కావాలనే పిల్ వేశారని చెప్పారు. అధికారులు తనను బ్లాక్‌మెయిల్ చేయాలని తప్పుడు కేసులు వేశారన్నారు. మైనింగ్ దొంగలకు సహకరించలేదనే తనపై తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. తన నియోజకవర్గంలో ఎలాంటి అన్యాయాలు, అక్రమాలు జరగడంలేదని స్పష్టం చేశారు. నిరాధార ఆరోపణలకు తాను భయపడనని తేల్చి చెప్పారు. (అసలు అక్కడ ఉద్యమమే లేదు)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top