కాబోయే హోం మంత్రిగారూ.. పవన్‌పై అంబటి సెటైర్లు | Ambati Rambabu Satires On Pawan Kalyan | Sakshi
Sakshi News home page

కాబోయే హోం మంత్రిగారూ.. పవన్‌పై అంబటి సెటైర్లు

Nov 8 2024 7:14 PM | Updated on Nov 8 2024 7:36 PM

Ambati Rambabu Satires On Pawan Kalyan

కాబోయే హోం మంత్రి పవన్‌ కల్యాణ్‌కు విజ్ఞప్తి అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో పంచ్‌లు విసిరారు.

సాక్షి, తాడేపల్లి: కాబోయే హోం మంత్రి పవన్‌ కల్యాణ్‌కు విజ్ఞప్తి అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో పంచ్‌లు విసిరారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ఉన్మాదుల కర్మాగారం ఎవరిది? వీళ్లందరినీ పెంచి పోషిస్తోంది ఎవరు?. పవన్‌ కల్యాణ్‌గారూ.. తన తల్లిని, బిడ్డలను తిట్టారని అన్నారు(పవన్‌ తన తల్లిని తిట్టారని గతంలో చేసిన వ్యాఖ్యల వీడియోను పోస్ట్‌ చేశారు). వాళ్లను క్షమించేశారు. మరి ఇవన్నీ తెలుగుదేశం ఫ్యాక్టరీలో తయారైనవే కదా. వీటన్నింటిని సూత్రధారి నారా లోకేష్‌. ఇప్పటికైనా ఇలాంటి వాళ్లపై చర్యలు తీసుకోండి. చెడును భుజాన వేసుకుని ఊరేగకండి’’ అంటూ పవన్‌కు అంబటి హితవు పలికారు. 

కాగా, ఏపీలో లా అండ్‌ ఆర్డర్‌పై, పోలీస్‌ శాఖపైనా పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, హోం మంత్రిగా అనిత పూర్తిగా విఫలమయ్యారన్న పవన్‌.. హోం మంత్రి జరుగుతున్న అఘాయిత్యాలపై  రివ్యూ జరపాలన్నారు. మంత్రిగా బాధత్య తీసుకోవాలి. విమర్శలను పట్టించుకోకపోతే.. చేతకాకపోతే హోం మంత్రి పదవి నుంచి తప్పుకోవాలి. నేను ఆ బాధ్యత తీసుకుంటా. ఒకవేళ.. నేను హోం శాఖ తీసుకుంటే పరిస్థితి వేరేలా ఉంటుందన్న పవన్‌ వ్యాఖ్యలను ఉటంకిస్తూ అంబటి చురకలు అంటించారు.

ఇదీ చదవండి: సీమరాజా, కిర్రాక్‌ ఆర్పీ, స్వాతి.. వీళ్లపై కేసులేవీ?: అంబటి

‘‘టీడీపీ సోషల్‌ మీడియా ఉన్మాద కారాగారం. టీడీపీ అరాచకాన్ని అడ్డుకోలేరు గానీ మావారిపై మాత్రం అక్రమ కేసులు పెడతారా?. పచ్చమీడియాని బహిష్కరించమని గతంలో పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రజ్యోతినా? టీడీపీ జ్యోతినా? అని విమర్శించారు. మా తల్లిని కూడా టీడీపి వారు దూషించారు అంటూ పవన్ అన్నారు. నన్ను, నా కూతుర్లని నీచంగా దూషిస్తూ పోస్టులు పెట్టారు. మరి వారిపై పవన్ కల్యాణ్‌కి వారిపై కూడా చర్యలు తీసుకోగల దమ్ము ఉందా?. హోంమంత్రికి ఆ సైకోలను అరెస్టు చేతనవుతుందా?. రేపు డీజీపిని స్వయంగా కలుస్తాం. అవసరమైతే ప్రైవేట్‌ కేసులు వేస్తాం’’ అని అంబటి రాంబాబు తేల్చి చెప్పారు.

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement