కుప్పం, చంద్రబాబుపై మంత్రి అంబటి ఆసక్తికర కామెంట్స్‌

Ambati Rambabu Interesting Commets On Kuppam And Chandrababu - Sakshi

సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు యాగీని, దత్తపుత్రుడు పవన్‌ కల్యాణ్‌ తీరును ప్రజలు పరిశీలిస్తున్నారు అని అన్నారు. 

కాగా, మంత్రి అంబటి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం తెచ్చిన జీవో అన్ని పార్టీకు వర్తిస్తుంది. చంద్రబాబు రోడ్‌షోలతో ఒరిగేది ఏమీ ఉండదు. చంద్రబాబు కాలుపెట్టిన చోట జనం పిట్టల్లా రాలిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతతో జీవో తీసుకువచ్చింది. ప్రభుత్వ జీవోపై చంద్రబాబు యాగీ చేస్తున్నారు. కుప్పంలో టీడీపీ సమాధి కావడం ఖాయం. కుప్పం ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అభిమానిస్తున్నారు. 

కుప్పం ప్రజలు స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఘన విజయం అందించారు. ఓటమి భయంతోనే చంద్రబాబు పదే పదే కుప్పం వెళ్తున్నారు. చంద్రబాబుకు కుప్పంలో కనీసం ఇళ్లు లేదు, ఓటు లేదు. చంద్రబాబు యాగీని ప్రజలు గమనిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జీవో1 వెనక్కి తీసుకునే ప్రస​‍క్తే లేదు. ప్రజాశ్రేయస్సును దృష్టిలో పెట్టుకునే జీవో1ను తీసుకువచ్చాము’ అని కామెంట్స్‌ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top