ఒక్కక్లిక్‌.. కొంపముంచే స్టేటస్‌! | - | Sakshi
Sakshi News home page

ఒక్కక్లిక్‌.. కొంపముంచే స్టేటస్‌!

Nov 21 2026 12:26 AM | Updated on Nov 21 2026 12:26 AM

సరదాగా పెట్టినా.. సీరియస్‌గా మారినా! ఉద్యోగాలకు ఎసరు.. దొంగలకు సమాచారం వ్యక్తిగత గోప్యత, భద్రతకు సోషల్‌ మీడియాతో ముప్పు

సాక్షి, పెద్దపల్లి:

సోషల్‌ మీడియా పోస్టుల విషయంలో ప్ర భుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా పోలీసు సిబ్బంది మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని ఇటీవ ల జరిగిన ఘటన గుర్తుచేస్తోంది. రామగుండం క మిషనరేట్‌ పరిధిలోని బెల్లంపల్లిలో ఫ్యామిలీ హౌ స్‌లో డ్యాన్స్‌ చేసిన వీడియోను కొందరు పోలీసు సిబ్బంది వాట్సాప్‌ స్టేటస్‌లో పెట్టుకోవడం వివాదానికి దారితీసింది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారు లు చర్యలు తీసుకున్నారు. వ్యక్తిగత సరదా కోసం చేసిన వీడియో కాస్త శాఖాపరమైన ఇబ్బందులకు కారణమైంది. ఉద్యోగుల సోషల్‌ మీడియా ప్రవర్తనపై ఈ ఘటన మరోసారి చర్చకు తెరలేపింది.

టిక్‌టాక్‌ వీడియోలతో ముగ్గురిపై వేటు

సోషల్‌ మీడియా వినియోగంలో నిర్లక్ష్యం ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో 2019లో కరీంనగర్‌ జిల్లాలో జరిగిన ఘటన మరో ఉదాహరణ. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప నిచేసే ముగ్గురు మహిళా ఉద్యోగులు విధి నిర్వహ ణ సమయంలో టిక్‌టాక్‌ వీడియోలు రూపొందించారు. అవి బయటకు వచ్చి వైరల్‌ కావడంతో అప్పటి కలెక్టర్‌ ఆదేశాల మేరకు ముగ్గురినీ సస్పెండ్‌ చేశారు. కార్యాలయ సమయాల్లో విధులకు బదులుగా సోషల్‌ మీడియాలో నిమగ్నమవడం ఉద్యో గులపై క్రమశిక్షణ చర్యలకు దారితీసింది.

స్టేటస్‌ చూస్తున్న దొంగలు!

సోషల్‌ మీడియా పోస్టులు కేవలం వ్యక్తిగత జీవితానికే పరిమితం కావడం లేదు. నేరసుస్తులకు కూడా సమాచార వనరుగా మారుతున్నాయి. కొత్తగా కొనుగోలు చేసిన కార్లు, బైక్‌లు, ఖరీదైన నగలు, ఇంట్లోని విలువైన వస్తువుల ఫొటోలను కొందరు బహిరంగంగా పోస్టు చేస్తున్నారు. విదేశీ పర్యటనలు, విహారయాత్రల వివరాలతోపాటు ఇంట్లో ఎవరూ లేని విషయాలను కూడా స్టేటస్‌లో పంచుకుంటున్నారు. ఇలాంటి సమాచారాన్ని నిశితంగా గమనించే దొంగలు ఇళ్లను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉంది. తెలియకుండానే తమ ఆస్తులు, కదలికలు, భద్రతకు సంబంధించిన వివరాలను నేరస్థులకు చేరవేస్తున్నట్లవుతోంది.

24 గంటల తర్వాత

మాయమైనా.. ప్రమాదం తప్పదు

వాట్సాప్‌ స్టేటస్‌ 24 గంటల తర్వాత తొలగిపోతుందని చాలామంది భావిస్తారు. అయితే అప్పటికే చూసిన వ్యక్తులు స్క్రీన్‌షాట్లు తీయడం, వీడియోలను డౌన్‌లోడ్‌ చేసి ఇతరులకు పంప డం సాధ్యమే. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల ఫొటోలు, వీడియోలను దుర్వినియోగం చేసి మార్ఫింగ్‌, బ్లాక్‌మెయిలింగ్‌ వంటి సైబర్‌ నేరాలకు పాల్పడే అవకాశాలున్నాయి. వ్యక్తిగత ఫొటోలు, కుటుంబ వివరాలు, ఆర్థిక సమాచారం ఒకసారి ఇతరుల చేతుల్లోకి వెళ్తే వాటి వినియోగంపై మనకు నియంత్రణ ఉండదు.

ఒక్క స్టేటస్‌.. కొందరికి సరదా.. మరికొందరికి తలనొప్పి!

సోషల్‌ మీడియాలో వైరల్‌ చేసే చిన్నపోస్టు కూడా ఒక్కోసారి ఉద్యోగానికి ఎసరు పెట్టవచ్చు.. వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయవచ్చు.. చివరకు నేరాలకు ఆధారంగానూ మారవచ్చు. ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా వెంటనే ఫొటోలు, వీడియోలు తీసి వాట్సాప్‌, ఇన్‌స్ర్ట్రాగామ్‌లో పంచుకోవడం చాలామందికి అలవాటుగా మారింది. లైక్‌లు, కామెంట్లు, వ్యూస్‌ కోసం చేసే ఈ పోస్టులు కొన్నిసార్లు అనూహ్య పరిణామాలకు దారితీస్తున్నాయి. విధినిర్వహణలో చేసిన వీడియోలతో ఉద్యోగులు క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొంటుండగా.. మరోవైపు ఖరీదైన వస్తువులు, ప్రయాణ వివరాలు, ఇంటి భద్రత సమాచారాన్ని బహిర్గతం చేయడం దొంగలకు అవకాశంగా మారుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement