పోలీస్‌ వ్యవస్థపై విశ్వాసం కాపాడడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ వ్యవస్థపై విశ్వాసం కాపాడడమే లక్ష్యం

Nov 21 2026 12:20 AM | Updated on Nov 21 2026 12:20 AM

● రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా

రామగుండం ఏఈవో మహేందర్‌కు ఊరట

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

ముత్తారం: ధర్యపూర్‌ మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు క బడ్డీ పోటీల్లో ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక అయ్యారని ప్రిన్సిపాల్‌ సంతోష్‌కుమార్‌ తె లిపారు. అండర్‌–17లో ఇంటర్మీడియట్‌ విద్యార్థి మణికంఠ, అండర్‌–14లో పదో తరగతి విద్యార్థి మారి శ్రీకాంత్‌ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యా రని వివరించారు. ఎంఈవో హరిప్రసాద్‌, ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి వెంకటేశ్‌, సర్పంచ్‌ రాపెల్లి రాజయ్యపటేల్‌, ఉపాధ్యాయులు అభినందించారు.

క్వింటాల్‌ పత్తి రూ.8,885

పెద్దపల్లిరూరల్‌: స్థానిక వ్యవసా య మార్కెట్‌యార్డులో శుక్రవా రం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.8,885, కనిష్టంగా రూ.8,614, సగటు రూ.8,733 గా ధర ఉందని మార్కెటింగ్‌ శాఖ అధికారి ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. 444 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసినట్టు ఆయన పేర్కొన్నారు.

గోదావరిఖని: పోలీస్‌ వ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని కాపాడటమే లక్ష్యమని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా తెలిపారు. నేరాల దర్యాప్తులో నాణ్యత, న్యాయస్థానాల్లో పటిష్టమైన ఆధారాల సమర్పణ, సమర్ధవంతమైన సమన్వయంతో నేరస్తులకు శిక్షలు పడేలా పోలీసుశాఖ కృషి చేస్తోందన్నారు. 2026లో రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 76 కాంటెస్టెడ్‌ కన్విక్షన్‌ కేసుల్లో 112 మంది నిందితులకు న్యాయస్థానం శిక్షతో పా టు కేసులన్నింటిలో కలిపి న్యాయస్థానాలు మొత్తం రూ.7,44లక్షలు జరిమానా విధించాయని ఆయన పేర్కొన్నారు. పోలీస్‌ అధికారులు, కోర్టు డ్యూటీ సిబ్బంది, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు సమన్వయంతో పనిచేస్తేనే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని ఆయన వివరించారు.

కేసులు.. శిక్షలు ఇలా..

8 కేసుల్లో 8మందికి జీవితఖైదు, రూ.55వేలు జరిమానా, 2 కేసుల్లో ఐగుగురికి 20ఏళ్ల జైలు శిక్ష, రూ.21వేల జరిమానా, ఒక కేసులో ఒకరికి 12ఏళ్లు జైలు, రూ.2లక్షలు జరిమానా విధించినట్లు సీపీ పేర్కొన్నారు. అదేవిధంగా 9 కేసుల్లో 10 మందికి 10ఏళ్లు జైలు, మొత్తం రూ.90వేల జరిమానా, ఒక కేసులో ఒకరికి ఏడేళ్ల జైలు, రూ.5వేల జరిమానా, 5 కేసుల్లో ఏడుగురికి 5ఏళ్ల జైలు, రూ.84వేల జరిమానా, మరో 39 కేసుల్లో 49 మందికి 4 సంవత్సరాలలోపు జైలు శిక్ష, 11 కేసుల్లో 31మందికి మొత్తం రూ.1,30లక్షలు జరిమానా విధించారని పోలీస్‌ కమిషనర్‌ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement