ప్రతీఒక్కరిలో తమను తాము ఇతరులకు చూపించుకోవాలనే ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా యువతలో లైక్‌లు, కామెంట్లు, వ్యూస్ కోసం ఆరాటం ఎక్కువగా కనిపిస్తోంది. ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా వెంటనే సోషల్ మీడియాలో పోస్టు చేయాలనే ఆలోచనకు ప్రధాన కారణం ఇతరుల నుంచి గుర్తింపు, ప్రశంసలు పొందాలనే మానసిక ధోరణి. ఈ క్రమంలో ఏది వ్యక్తిగతం, ఏది బహిరంగంగా పంచుకోవాలనే విచక్షణ కొరవడుతోంది. ఆవేశంలోనో, సరదాగానో పెట్టిన పోస్టులు ఉద్యోగ జీవితం, వ్యక్తిగత గౌరవం, భద్రతపై ప్రభావం చూపవచ్చు. సోషల్ మీడియా మన జీవితాన్ని నియంత్రించకూడదు. దాన్ని ఎంతవరకు ఉపయోగించాలనేది మనమే నిర్ణయించుకోవాలి.
– డాక్టర్ రవివర్మ, సైక్రియాట్రిస్ట్, జీజీహెచ్


