ఇందిరమ్మ బీమాతో భరోసా | - | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ బీమాతో భరోసా

Nov 21 2026 12:20 AM | Updated on Nov 21 2026 12:20 AM

కోల్‌సిటీ: కుటుంబంలో సంపాదించే వ్యక్తి మ రణిస్తే ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభు త్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అ మలు చేస్తోందని రామగుండం కమిషనర్‌ అ రుణశ్రీ అన్నారు. 54వ డివిజన్‌ జవహర్‌నగర్‌లో కార్పొరేటర్‌ ఎండీ ముస్తాఫా ఆధ్వర్యంలో శుక్రవారం బీమా వివరాల నమోదు ప్రక్రి య ప్రారంభించి మాట్లాడారు. ఈపథకం ద్వా రా రూ.5 లక్షల బీమా రక్షణ కల్పిస్తారని తెలిపారు. రేషన్‌కార్డు, ఆధార్‌, బీమా పొందే వ్యక్తి, నామినీ వివరాలు, మొబైల్‌ నంబర్‌ ఇస్తే నగర పాలక సిబ్బంది ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారని వివరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ గట్ల రమేశ్‌, డిప్యూటీ కమిషనర్‌ వెంకటస్వా మి, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ శాంతిస్వరూప్‌, తహసీల్దార్‌ రవీందర్‌రావు పాల్గొన్నారు.

గ్రంథాలయాలు.. విజ్ఞానకేంద్రాలు

పెద్దపల్లిరూరల్‌: విద్యావంతులు పుస్తక పఠనం అలవర్చుకోవాలని, అందుకు సమీపంలోని గ్రంథాలయాలకు వెళ్లి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అన్నయ్యగౌడ్‌ అన్నారు. జిల్లా గ్రంధాలయంలో శుక్రవారం వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో డీఎల్‌పీవో దేవకీదేవి, గర్ల్‌చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ కవిత, గ్రంథాలయ కార్యదర్శి కనకలక్ష్మితో కలిసి పాల్గొన్నారు. సెల్‌ఫోన్‌ను మితిమీరి వినియోగించి సమయ్యం వృథా చేసుకోవడం కన్నా గ్రంథాలయాలకు వెళ్లి పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడం ఎంతోమంచిదని తెలిపారు. వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన పోటీపరీక్షల్లో విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందించారు. మహమ్మద్‌ గఫార్‌, వెంకటేశం, శ్రీనివాస్‌, యునుస్‌ఖాద్రీ, కవిత, స్వరూప, షేర్‌ఖాన్‌, సదానందం, సంపత్‌ తదితరులు ఉన్నారు.

ఆర్టీసీ పుణ్యక్షేత్రాల యాత్ర

గోదావరిఖనిటౌన్‌: గోదావరిఖని డిపో నుంచి అరుణాచలం, రామేశ్వరం సహా ప్రముఖ పుణ్యక్షేత్రాల దర్శనం కోసం ప్రత్యేకయాత్ర ఏర్పాటు చేస్తున్నట్లు డీఎం కవిత తెలిపారు. శ్రీశైలం మల్లికార్జునస్వామి జ్యోతిర్లింగం, కాణిపాకం, స్వయంభూ వరసిద్ధి వినాయక స్వా మి, అరుణాచలం అన్నామలయార్‌ స్వామి దర్శనం, గిరిప్రదక్షిణ, శ్రీరంగం శ్రీరంగనాథ స్వామి, పళని శ్రీమురుగన్‌ స్వామి, పాతాళశెంబు శ్రీసుబ్రహ్మణ్యస్వామి, మధురై మీనాక్షి అమ్మవారు, కన్యాకుమారి అమ్మవారు, రామే శ్వరం శ్రీరామనాథస్వామి, కాంచీపురం శ్రీఏ కాంబరేశ్వర స్వామి, జోగులాంబ శక్తిపీఠం వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు. ఈనెల 25 న గోదావరిఖనిలో సూపర్‌ లగ్జరీ బస్సులో ప్రారంభమవుతుందన్నారు. వివరాల కోసం 70135 04982, 73828 47596 నంబర్లలో సంప్రదించాలని ఆమె కోరారు.

చీకురాయి రైల్వేగేటు మూసివేత

పెద్దపల్లిరూరల్‌: చీకురాయి గ్రామంలోని రైల్వే లెవల్‌ క్రాసింగ్‌ గేట్‌(నంబరు 38/ఈ) వారం రోజుల పాటు మూసివేస్తున్నామని సీనియర్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ నారాయణశ శుక్రవారం తెలిపారు. ఈనెల 21 నుంచి 28వ తేదీ వరకు మరమ్మత్తుల నేపథ్యంలో మూసి ఉంచుతున్నట్టు పేర్కొన్నారు. ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని ఆయన కోరారు.

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో తనిఖీలు

పెద్దపల్లి: జిల్లాలోని పలు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో జిల్లా వైద్యాధికారి పవిత్ర ఆకస్మిక తనిఖీలు చేశారు. వైద్య సేవల నాణ్యత, వైద్యులు, నర్సింగ్‌, సిబ్బంది హాజరు వివరాలను పరిశీలించారు. అగ్నిమాపక భద్రతా చర్యలు, అత్యవసర వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. పవిత్ర మాట్లాడుతూ ప్రైవేట్‌ ఆస్పత్రులు నిబంధనలు, వైద్య ప్రమాణాలను పాటించాలని ఆమె సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement