19న జేఎన్‌ఆర్ స్టేడియంలో ఘనంగా దసరా ఉత్సవాలు
మేయర్ మహంకాళి స్వామి
కోల్‌సిటీ: తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు రామగుండం మేయర్ మహంకాళి స్వామి తెలిపారు. రామ గుండం బల్దియా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు మేయర్ సతీసమేతంగా హాజరై మాట్లాడారు. అన్ని డివిజన్లలో బతుకమ్మ ఆడే ప్రాంతాలను చదును చేయించడంతోపాటు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తున్నట్లు చె ప్పా రు. ఈనెల 19న సింగరేణి జవహర్‌లాల్ నెహ్రూ స్టే డియంలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. బతుకమ్మ, దసరా పండుగలను ఆహ్లాదకర వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అ రుణశ్రీ, కార్పొరేటర్లు, అధికారులు, మహిళా ఉ ద్యోగులు, మెప్మా సిబ్బంది, స్వశక్తి మహిళలు బ తుకమ్మ సంబురాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.


