బతుకమ్మ ఘాట్‌ వద్ద ఏర్పాట్లు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

బతుకమ్మ ఘాట్‌ వద్ద ఏర్పాట్లు చేపట్టాలి

Oct 6 2026 11:47 PM | Updated on Oct 6 2026 11:47 PM

రామగిరి: బతుకమ్మ పండుగ సందర్భంగా నిమజ్జనానికి వచ్చే మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఘాట్‌ వద్ద అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సింగరేణి ఆర్జీ–3 ఏరియా జీఎం సుంకర మధుసూదన్‌ అధికారులను ఆదేశించారు. స్థానిక సోలార్‌ కంట్రోల్‌ కార్యాలయం సమీపంలోని బొక్కలవాగు వద్ద ఏర్పాటు చేస్తున్న బతుకమ్మ నిమజ్జన ఘాట్‌ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఘాట్‌ పరిసరాల్లో పారిశుధ్య నిర్వహణ, తాగునీటి వసతి, విద్యుత్‌ దీపాల ఏర్పాటు, భద్రతా చర్యలపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఎస్‌వోటూ జీఎం ఎం.రామ్మోహన్‌, డీజీఎం ఎస్‌.రవికుమార్‌, పర్సనల్‌ విభాగాధిపతి బి.సుదర్శనం, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement