ధర్మారం: నందిమేడారం నంది పంప్‌హౌస్ ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని ఆదివారం నా లుగు పంప్‌లు ఆన్‌చేసి మేడారం రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గ్రావిటీ కాలువ ద్వారా నంది పంప్‌హౌస్‌లోని సర్జిఫూల్‌కు చేరుకున్న తర్వాత పంప్‌లను ఆన్‌చేశారు. ఒక్కొక్క పంప్ నుంచి 3,150 క్యూసెక్కుల నీటిని డెలీవరి సిస్టర్న్ ద్వారా రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తున్నారు. ఇదేపరిమాణంలో రిజర్వాయర్ గేట్ల ద్వారా సొరంగమార్గం నుంచి రామడుగు మండలం లక్ష్మీపూర్ పంప్‌హౌస్‌కు తరలిస్తున్నారు. అక్కడ నుంచి వివిధ ప్రాజెక్టులకు నీటిని తరలిస్తున్నారు.
శ్లోక కంఠస్థ పోటీలు
పెద్దపల్లి: తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీమత్ భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలు నిర్వహించనున్నట్లు ఆచార్యుడు మెంగని చంద్రశేఖర్ తెలిపా రు. వచ్చే డిసెంబరు 20న గీతా జయంతిని పు రస్కరించుకుని పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులు అర్హులన్నారు. ఇతర వివరాలు, పేర్ల న మోదు కోసం 99120 78519 నంబరులో సంప్రదించాలని ఆయన సూచించారు.
ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా రమేశ్
పెద్దపల్లి: సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామానికి చెందిన చాత రాజు రమేశ్‌ను బీజేపీ ఓ బీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. ఈమేరకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. తన నియామకానికి సహకరించిన బీజేపీ రాష్ట్ర అ ధ్యక్షుడు రాంచందర్‌రావు, నాయకులు తది తరులకు రమేశ్ కృతజ్ఞతలు తెలిపారు.
నేటినుంచి బ్యాంకర్ల సమ్మె
పెద్దపల్లి: వారంలో ఐదురోజుల పనిదినాలు అ మలు చేయాలనే డిమాండ్‌తో సోమవారం నుంచి మూడురోజుల పాటు బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేసేందుకు సిద్ధమయ్యారు. యుౖ నెటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్‌బీయూ) పిలుపు మేరకు ప్రభుత్వ, ప్రైవే ట్, గ్రామీణ బ్యాంకుల్లో లావాదేవీలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. అయితే, ఆదివారం(ఈనెల 27న) బ్యాంకులు యథావిధిగా పనిచేశాయి. ఈనెల 28, 29, 30వ తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ తదితర యూనియన్ల నేతలు సునీల్, ముత్యంరావు, శ్రీనివాస్ తదితరులు మద్దతు ప్రకటించారు.
‘ప్రయాణాలు తగ్గించారు’
మంథని: మహిళాకు ఉచిత ప్రయాణం కల్పిస్తు న్నామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. మ హాలక్ష్మి పథకంలోని ఎక్స్‌ప్రెస్ బస్సులను త గ్గించి, డీలక్స్‌ల్లో డబుల్ చార్జీలు వసూలు చేస్తున్నారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు విమర్శించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ను ఆదివారం సందర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆడవాళ్ల ప్రయాణం తగ్గించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. మంథని నుంచి హైదరాబాద్‌కు అనేక ఏళ్లుగా బస్సులు నడిచేవని, ప్రస్తుతం హైదరాబాద్, దిల్‌సుఖ్‌నగర్, మియాపూర్ బస్సు రద్దు చేసి కేవలం సిద్దిపేట వరకు నడిపిస్తున్నారని అన్నా రు. మంథని – భద్రాచలం ఎక్స్‌ప్రెస్ బస్సు రద్దుచేసి మహిళలు వెళ్లకుండా చేశారన్నారు. ఈ బస్సును పునరుద్ధరించాలని డిమాండ్ చేశా రు. నాయకులు ఏగోళపు శంకర్‌గౌడ్, ఆరెపల్లి కుమార్, రాజూగౌడ్, కనవేన శ్రీనివాస్, పుప్పాల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.


