కూరగాయల సాగు.. ఆదాయం బోలెడు | - | Sakshi
Sakshi News home page

కూరగాయల సాగు.. ఆదాయం బోలెడు

Sep 28 2026 7:39 AM | Updated on Sep 28 2026 7:39 AM

పెద్దపల్లిరూరల్‌: కూరగాయలు పండించే రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. ప్రజలకు నిత్యం అవసరమయ్యే కూరగాయల సాగుతో రోజువారీ ఆదాయం సమకూరుతుంది. దిగుబడి, ధరను బట్టి బోలెడు లాభాలు వస్తున్నాయని అంటున్నారు. జిల్లాలో 833 ఎకరాల్లో వీటిని సాగుచేస్తుండగా.. అందులో 180 ఎకరాల్లో టమాట సాగవుతోంది. జిల్లాలోని సుల్తానాబాద్‌ మండలం సుగ్లాంపల్లి, పెద్దపల్లి శివారు రంగంపల్లితోపాటు హన్మంతునిపేట, చీకురాయి తదితర గ్రామాల్లో కూరగాయలు విస్తృతంగా సాగవుతున్నాయి.

తీగజాతి పంటల వైపు..

తీగజాతి కూరగాయలు పండించేందుకు ముందుకొచ్చే రైతులకు ఎకరాకు రూ.4వేలను వెదురుతో పందిరి నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం ఉద్యానవన శాఖ ద్వారా అందిస్తోంది. బీర, సొర, కాకర, దొండ లాంటి తీగజాతి పంటలు వేసే రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.

రాయితీలతో ప్రోత్సాహం

కూరగాయల సాగువైపు రైతులు దృష్టి సారించేలా జిల్లా ఉద్యానవన శాఖ రాయితీలను అందించి ప్రోత్సహిస్తోంది. కూరగాయల తోటలో కలుపు పెరగకుండా మల్చింగ్‌షీట్లు వేసేందుకు హెక్టారుకు రూ.20వేలు రాయితీని అందిస్తున్నారు. అంతర కృషి కోసం మినీట్రాక్టర్లు, పవర్‌ స్ప్రేయర్‌ లాంటి యంత్రాలను 50శాతం రాయితీపై అందిస్తున్నారు.

102 ఎకరాలు.. 43 మంది రైతుల గుర్తింపు

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్న హరేరామ.. హరేకృష్ణ ఫౌండేషన్‌ వారికి ప్రతీవారం 50 మెట్రిక్‌ టన్నుల నాణ్యమైన కూరగాయలను అందించేందుకు 43 ఎకరాల్లో సాగు చేస్తున్న 102 మంది కూరగాయల రైతులను ఎంపిక చేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి. సేంద్రియ పద్ధతుల్లో సాగుచేసే రైతుల నుంచి నాణ్యమైన కూరగాయలను సేకరించాలని ఫౌండేషన్‌ నిర్ణయం తీసుకుంది.

మల్చింగ్‌ షీట్‌, పందిర్ల కోసం రాయితీలు

రైతులకు ప్రోత్సాహం అందిస్తున్న ప్రభుత్వం

ఎల్‌నినో ప్రభావాన్ని అధిగమించేందుకు అధికారుల చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement