గోదావరిఖని: సింగరేణి రెస్క్యూపోటీల్లో ఓవరాల్ చాంపియన్‌గా ఆర్జీ–2,3, ఏపీఏ జట్టు నిలిచింది. పోటీల్లో ఓవరాల్ ఫస్ట్ ఉమెన్ జట్టుగా స్మార్ట్ ఏ జట్టు నిలిచింది. మెటల్ టీంలో ఓవరాల్ ఫస్ట్‌గా యూరేనియం కార్పొరేషన్ జట్టు, ఓవరాల్ రెండో స్థానంలో ఆర్జీ–1, ఓవరాల్ మూడో స్థానంలో శ్రీరాంపూర్ జట్టు నిలిచాయి. బెస్ట్ ఉమెన్ కెప్టెన్‌గా మౌనిక, బెస్ట్ మెటల్ కెప్టెన్‌గా భాస్కర్, ఫస్ట్ బెస్ట్ కెప్టెన్‌గా జి.ప్రమోద్‌కుమార్ ఎంపికయ్యారు. రెండో ఫస్ట్ కెప్టెన్‌గా సాంబ నిలిచారు. వీటితో బెస్ట్ స్టాట్యుటరీ, థియరీ, ఫస్ట్‌ఎయిడ్, రెస్యూ అండ్ రికవరీ, బెస్ట్ మెంబర్లను ప్రకటించారు. విజేతలకు డిప్యూటీ డైరెక్టర్ మైన్స్ సేఫ్టీ టీఆర్ కన్నన్, సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్లు బహుమతులు అందజేశారు. పోటీల ముగింపు సందర్భంగా నిర్వహించిన చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. మంథని జేఎన్‌టీయూ కళాశాల విద్యార్థులతో పాటు పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.
గని కార్మికుల భద్రతకు పెద్దపీట వేయాలి
గని కార్మికుల భద్రతకు పెద్దపీట వేయాలని డి ప్యూటీ డైరెక్టర్ మైన్స్ సేఫ్టీ టీఆర్ కన్నన్ అన్నారు. గురువారం ఆర్జీ–2 ఏరియాలో నిర్వహించిన రె స్క్యూ పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అ తిధిగా విచ్చేసి మాట్లాడారు. గతంలో పలు దేశాల్లో జరిగిన గని ప్రమాదాలే దేశంలోని గనుల రెగ్యులేషన్స్ రూపొందించేలా చేశాయన్నారు. డిపార్ట్‌మెంట్, కార్పొరేషన్, బోర్డు సాధించిన ఏ విజయమైనా గని కార్మికుల (మైనర్స్) భద్రత కంటే గొప్పదేదీ కా దన్నారు. డైరెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రకృతి విపత్తు సంభవించిన సమయంలో సింగరేణి రెస్క్యూ ముందంజలో ఉండి ప్రజలకు భరోసా ఇస్తోందని అన్నారు. సింగరేణిలో పనిచేసే ప్రతీ ఉద్యోగి రెస్క్యూ పర్సన్‌గా తయారు కావాలన్నారు. రెస్క్యూ జీఎం శ్రీనివాస్‌రెడ్డి, ఆర్జీ–2 జీఎం లక్ష్మిపతిగౌడ్, ఆర్జీవన్ జీఎం లలిత్‌కుమార్, అన్ని ఏరియాల జీఎంలు, అధికారులు పాల్గొన్నారు.


