మర్యాదగా ప్రవర్తించాలి | - | Sakshi
Sakshi News home page

మర్యాదగా ప్రవర్తించాలి

Sep 25 2026 2:41 AM | Updated on Sep 25 2026 2:41 AM

● రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా

సుల్తానాబాద్‌రూరల్‌: పోలీస్‌స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ ఝూ అన్నారు. గురువారం సుల్తానాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా క్రైం రేట్‌, సర్కిల్‌ పరిధిలో నమోదవుతున్న కేసులు, రికార్డులు, సీసీ కెమెరాల కమాండ్‌ కంట్రోల్‌ రూంను పరిశీలించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ, రౌడీషీటర్లు, సస్పెక్ట్‌ షీట్‌లో ఉన్న వ్యక్తులు, ఇతర నేరుస్తుల ఇళ్లను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ వారి కదలికలపై నిరంతరం నిఘా పెట్టాలన్నారు. సీసీ కెమెరాల ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ఏర్పాటు చేసుకునేల చూడాలన్నారు. రాజీవ్‌ రహదారిపై రోడ్డు ప్రమాదాల నియంత్రణకు బ్లాక్‌ స్పాట్‌ల వద్ద రక్షణ చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. ముందుగా సీపీకి సీఐ రంజిత్‌రావు, ఎస్సై చంద్రకుమార్‌ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement