రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

Sep 25 2026 2:41 AM | Updated on Sep 25 2026 2:41 AM

జ్యోతినగర్‌: మంచిర్యాల జిల్లా ఇందారం వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎన్టీపీసీ కృష్ణానగర్‌కు చెందిన అనురాధ త్రివేది మృతి చెందారు. ఇందారం ఓఎల్‌వీఏ కార్యాలయం నుంచి గోదావరిఖని వైపు వస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న వాహనాన్ని లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. తీవ్ర గాయాలతో అనురాధ త్రివేది ప్రమాద స్థలంలోనే మృతి చెందింది. ఆమె భర్త వేణుగోపాల్‌ త్రివేది ఎన్టీపీసీ కృష్ణానగర్‌లో నివాసం ఉంటూ లయన్స్‌ క్లబ్‌లో ప్రముఖుడిగా కొనసాగుతున్నారు. అనురాధ మృతితో ఎన్టీపీసీ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement