మందులు కొనుగోలు చేసేటప్పుడు బిల్లు తీసుకోవడం వినియోగదారుడి హక్కు. బిల్లు ఇవ్వడం మెడికల్ షాపు నిర్వాహకుల బాధ్యత. ఫార్మసీ విద్యార్హత ఉన్నవారు తమ సర్టిఫికెట్లను ఇతరుల వ్యాపారం కోసం ఇవ్వకూడదు. రోగులకు మందుల వినియోగంపై సరైన అవగాహన కల్పించడం ఫార్మసిస్టుల బాధ్యత. పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తూనే, ప్రతి నెలా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, నెలకు సుమారు 15 దుకాణాలను సీజ్ చేస్తున్న. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడితే చర్యలు తప్పవు. – పిట్ట శ్రావణ్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్


