కాల్వశ్రీరాంపూర్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై అభూత కల్పనలతో పుస్తకం ప్రచురించిన ప్రసాద్‌పై పరువు నష్టం దావా వేస్తామని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు అంబాల రాజేందర్, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఉపాధ్యక్షుడు కల్లెపెల్లి సాగర్, ఆర్టీఐ చట్టం కో ఆర్డనేటర్ కుంట శ్రీకాంత్ హెచ్చరించారు. మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి శనివారం క్షీరాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, మహనీయులపై అనుచిత వాఖ్యలు చేస్తూ పుస్తకం ప్రచురించిన ప్రసాద్‌పై పోలీసులు కేసు నమోదు చేయడం హర్షణీయమే అన్నారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేడ్కర్ సంఘం నాయకులు ఉమామహేశ్వర్, చిలుముల రామస్వామి, సిరికొండ నిషాంత్, హరీ శ్, రాకేశ్, రాజేశ్, రాజు తదితరులు పాల్గొన్నారు.


