రామగిరి ఖిల్లా సందర్శన | - | Sakshi
Sakshi News home page

రామగిరి ఖిల్లా సందర్శన

Sep 20 2026 1:33 AM | Updated on Sep 20 2026 1:33 AM

పెద్దపల్లిరూరల్‌: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థులు శనివారం చారిత్రక రామగిరి ఖి ల్లాను సందర్శించారు. కళాశాల ఎకో క్లబ్‌, టూ రిజం క్లబ్‌ తదితర విభాగాలకు చెందిన విద్యార్థులకు ప్రిన్సిపాల్‌ లక్ష్మీనర్సయ్య ఆయా శాఖ ల అధ్యాపకులు ఖిల్లా చారిత్రక ప్రాధాన్యం గురించి అవగాహన కల్పించారు. వైజ్ఞానిక, ఆ ధ్యాత్మిక క్షేత్రం అని వివరించారు. ఖిల్లాపై ఎ న్నో రకాల ఔషధ మొక్కలు ఉన్నాయని వృక్షశాస్త్ర విభాగాధిపతి సునీత వివరించారు. పలువురు అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

ఫీజు కడితేనే పీజీలో సీటు

పెద్దపల్లిరూరల్‌: పే ద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు ఉన్నత వి ద్య అందించాలనే సంకల్పంతో దివంగత సీఎం వైఎస్‌ రా జశేఖరరెడ్డి అమలులోకి తీసుకొచ్చిన ఫీజురీయిబర్స్‌మెంట్‌ పథకం అమలుపై ప్రస్తుత సర్కార్‌ నిర్ల క్ష్యం చేస్తోంది. భోజన్నపేటకు చెందిన పోతు ల సంహిత పీజీలో ఎంకాం చదివేందుకు ఎంట్రన్స్‌ రాయగా.. 368 ర్యాంక్‌ వచ్చింది. హైదరాబాద్‌ నిజాం కాలేజీలో సీటు కేటాయించారు. సంహిత(ఎస్సీ) కోర్సు ఏడాది రుసుం రూ.20,800 ఉండగా అందులో కే వలం రూ.800 చెల్లించాలని పేర్కొంది. దాని ఆధారంగా పెద్దపల్లిలోని మీ సేవ కేంద్రం ద్వారా రూ.800 చెల్లించింది. అలా ఆ ఎడాది ఫీజు మొత్తం రూ.20,800 చెల్లించాల్సిందేనని, ప్రభుత్వం నుంచి రీయింబర్స్‌మెంట్‌ వి ద్యార్థి ఖాతాకే జమ అవుతుందని కాలేజీ యాజమాన్యం చెబుతోందని సంహిత తెలిపింది. అధికారులు చొరవ చూపి తమకు సీటు కేటాయించేలా చూడాలని కోరుతోంది.

దసరాకు బస్సు డిపో షురూ

పెద్దపల్లిరూరల్‌: స్థానిక బస్టాండ్‌ సమీపంలో చే పట్టిన బస్సు డిపో పనులను ఆర్టీసీ ఎగ్జిక్యూ టివ్‌ డైరెక్టర్‌ రాజశేఖర్‌ కరీంనగర్‌ ఈడీ సాల్మన్‌తో కలిసి శనివారం పరిశీలించారు. పనుల పురోగతిపై ఈఈ శ్రీకాంత్‌ వారికి వివరించా రు. బస్సుడిపోలో పనిచేసే అధికారులకు గదు ల కేటాయింపు ప్రక్రియ పూర్తిచేశారు. ఈడీ రాజశేఖర్‌ మాట్లాడుతూ, వచ్చే దసరా పండుగ వరకు డిపో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే బస్సుల కేటాయింపు ప్రక్రియ కూడా పూర్తయిందని వివరించా రు. స్థానిక బస్టాండ్‌ను కూడా ఆధునికీకరిస్తామని చెప్పారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్లాట్‌ఫాంలు విస్తరిస్తామని పేర్కొన్నారు. అధికారులు రాంగోపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌, రాజేశ్‌, కనకయ్య తదితరులు ఉన్నారు.

కళాకారులకు గౌరవం

పెద్దపల్లి: తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కళాకారుల గౌరవం కాపాడడం, సంక్షేమంపై దృష్టి పెట్టడం, ఉపాధి అవకాశాలు కల్పించాలని హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి, రైతుసంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జస్టిస్‌ బి.చంద్రకుమార్‌, పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ గ డ్డం లక్ష్మణ్‌ అన్నారు. సమతా ఫౌండేషన్‌, సమ తా సైనికదళ్‌ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో శనివారం కళాకారులకు ఆత్మీయ సన్మానం జరిగింది. సమతా ఫౌండేషన్‌ చైర్మన్‌, సమతా సైనికద ళ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దుర్గం నగేశ్‌ను ఈ సందర్భంగా సన్మానించారు. ప్రతినిధులు కె.విశ్వనాథ్‌, జి.సారయ్యగౌడ్‌, జి.మల్లేశం ఉన్నారు.

25న కౌన్సిల్‌ సమావేశం

కోల్‌సిటీ: ఆరు నెలలల తర్వాత రామగుండం బల్దియా కౌన్సిల్‌ రెండోసాధారణ సమావేశా న్ని ఈనెల 25న నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కౌన్సిల్‌ ఏర్పడిన ఈ ఏ డాది మార్చి 25న తొలిబడ్జెట్‌ సమావేశంతో పాటు అదేరోజు తొలి సమావేశం నిర్వహించా రు. ఆ తర్వాత ఇప్పటివరకు ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదు. ఎట్టకేలకు మరోసారి సమావేశం నిర్వహణకు ఏర్పాట్లు చేపట్టారు. 26 అంశాలతో రూపొందించిన ఎజెండాపై మేయర్‌ మహాంకాళి స్వామి సంతకం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement