గోదావరిఖని: రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అ ధ్యక్షుడిగా ఎండీ ముస్తాఫా నియమితులయ్యారు. ఈమేర కు ఆలిండియా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం ప్రకటన విడుదల చేశారు. ఈపదవి కోసం 8మంది నామినేషన్ వేయగా మైనార్టీ వర్గానికి చెందిన కార్పొరేటర్ ముస్తాఫా వైపు మొగ్గు చూపింది. ఇప్పటివరకు బొంతల రాజేశ్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రెండోసారి కార్పొరేటర్‌గా గెలిచి, పార్టీ కార్పొరేషన్ కీలకస్థానానికి ఎంపికైన ముస్తాఫాను ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్, మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపెల్లి ఎల్లయ్య, కాంగ్రెస్ నాయకులు అభినందించారు.


