తక్కువ నీరు.. అధిక దిగుబడి | - | Sakshi
Sakshi News home page

తక్కువ నీరు.. అధిక దిగుబడి

Sep 20 2026 1:33 AM | Updated on Sep 20 2026 1:33 AM

● వరిసాగులో తక్కువ నీటి వినియోగం ● ఆధునిక సాంకేతికతతో ఆరుతడి పంటలు ● రైతులకు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అవగాహన

పెద్దపల్లిరూరల్‌: ఆరుతడి పంటల మాదిరిగానే తక్కువ నీటితో అధిక దిగుబడి ఇచ్చే వరి వంగడాలపై దృష్టి సారించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సూ చించారు. సో అండ్‌ రీప్‌ ఎన్‌జీవో సంస్థ రంగంపల్లి గ్రామంలో శనివారం నిర్వహించిన ‘వరి వరహాలు’లో భాగంగా తక్కువ నీరు, రసాయన మందులతో అధిక దిగుబడి సాధించిన రైతులకు (ఎకరాకి రూ.500చొప్పున) ప్రోత్సాహాకాలను కలెక్టర్‌తోపాటు సంస్థ ఎండీ దివ్య, సీఈవో మురళీధర్‌ అందించి అభినందించారు. వరి సాగుకు అవసరమైన మేరకే నీటిని వినియోగించేలా రైతుల్లో చైతన్యం తెచ్చేందుకు కృషి చేస్తున్న సంస్థ ప్రతినిధులను కలెక్టర్‌ అభినందించారు. భవిష్యత్తులో బయోచర్‌, బ యోగ్యాస్‌, ఆగ్రోఫారెస్ట్రీ ప్రాజెక్టుల ఏర్పాటుకు స హకారం అందిస్తామని కలెక్టర్‌ అన్నారు. తడిపి ఆరబెట్టే విధానం ద్వారా నీటి వినియోగం గణనీయంగా తగ్గుతుందని జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్‌ తెలిపారు. ఈ ప్రాంత రైతులు వరి సాగులో అవసరానికి మించి నీటిని వినియోగించడంతో దిగుబడి తగ్గడమే కాకుండా భూసారం దెబ్బతింటుందని ఆ సంస్థ ఎండీ దివ్య అన్నారు. కార్యక్రమంలో ఏడీఏలు శ్రీనాథ్‌, కాంతయ్య, ఆర్డీవో ఆఫీసు డీఏవో రవీందర్‌, ఏవో నాగార్జున, మేనేజర్‌ వెంకటరమణ, పృథ్వీరాం, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement