పెద్దపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్‌ఎస్ నేత లు ప్రజలను తప్పుదోవ ప ట్టిస్తున్నారని ప్రభుత్వ విప్ విజయరమణారావు విమర్శించారు. ఎల్లంపల్లి నుంచి ప్రాణహిత–చేవెళ్ల వరకు ప్రాజెక్టు రూపకల్పన కాంగ్రెస్ హయాంలోనే జరిగిందన్నారు. శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడారు. ఎల్‌నినో ప్ర భావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందని, రైతులకు శాస్త్రవేత్తలతో అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఎస్సారెస్పీ ద్వారా సాగునీటిని సమర్థంగా వినియోగించాలని విప్ సూచించారు.
సమస్యలు పరిష్కరించాలి
గోదావరిఖని: హామీ మేరకు సింగరేణి కార్మికుల సమస్య లు పరిష్కరించాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ కోరారు. అసెంబ్లీలో శుక్రవారం మాట్లాడా రు. 76 జీవో అమలుతో ఇళ్లపట్టాలు, మారు పేర్ల సమస్యపై కమిటీ ఏర్పాటు చేసి, ప్రక్రియ పూర్తిచేయాలని కోరారు. కార్మికుల సొంతింటి కల నెరవేర్చాలని అన్నారు. నియోజకవర్గానికి మంజూరైన రోడ్ల పనులు కాంట్రాక్ట్ ప్రక్రియ పూర్తిచేసి హైపవర్ కమిటీకి పంపించారని తెలిపారు. 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని ఆయన కోరారు.
ఉద్యోగుల అభ్యున్నతికి కృషి
జ్యోతినగర్: ఉద్యోగుల అభ్యున్నతికి ఎన్టీపీసీ కృషి చేస్తుందని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత అన్నారు. పర్మినెంట్ టౌన్‌షిప్‌లో నిర్మించిన సీ–టైప్ నివాస భ వనం టవర్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కొత్త భవనంతో వసతులు మరింత మెరుగుపడుతాయన్నారు. కార్యక్రమంలో ఉన్నతాధికారులు, అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ముగిసిన పదవీకాలం
పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవీకాలం శుక్రవారం ముగిసింది. మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఈర్ల స్వరూప తన పదవికి రాజీనామా చేసి మున్సిపల్ ఎన్నికల్లో 7వ వార్డు సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో వైస్ చైర్మన్ కూర మల్లారెడ్డి ఇన్‌చార్జి చైర్మన్‌గా కొనసాగారు. పదవీకాలం ముగియడంతో మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, ఏడీఏ శ్రీనాథ్, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్‌రెడ్డి తదితరులు పాలకమండలిని సత్కరించారు. కాగా, చైర్మన్ పదవికి ముడుసు సాంబిరెడ్డి, కనగర్తి మాజీ సర్పంచ్ ఎడెల్లి శంకర్ పోటీపడుతున్నట్టు ప్రచారం. ప్రభుత్వ విప్ విజయరమణారావు అనుగ్రహం పొందిన వారినే చైర్మన్ పదవి వరిస్తుందని చర్చించుకుంటున్నారు.
ఇక మహిళా ఎస్‌అండ్ పీసీలు
గోదావరిఖని: సింగరేణి ఆర్జీ–1లో మహిళా జ నరల్ అసిస్టెంట్లు, మహిళా జనరల్ అసిస్టెంట్ ట్రైనీలకు ఎస్ అండ్ పీసీలో పనిచేసే అవకాశం కల్పించారు. ఆసక్తి గల వారినుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ జీఎం ఈనెల 17న సర్క్యులర్ జారీచేశారు. ఏడో తరగతి కనీస విద్యార్హతగా నిర్దేశించారు. ప్రస్తుత సీనియారిటీ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎస్ అండ్ పీసీలో చేరినా ప్రస్తుత సర్వీస్ కండీషన్లు, కేటగిరీ, బేసిక్‌పేలో మార్పు ఉండదని స్పష్టం చేశా రు. ఆసక్తిగలవారు ఈనెల 22లోగా ఆర్జీవన్ పర్సనల్ విభాగంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆగస్టు 14న జారీచేసిన ఉత్తర్వు ప్రకారం ఇప్పటికే దరఖాస్తు చేసినవారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని తాజా సర్క్యులర్‌లో స్పష్టం చేశారు.
30లోగా సర్వే పూర్తి
పెద్దపల్లి: జిల్లాలో చేపట్టిన పంటల డిజిటల్ సర్వేను ఈనెల 30లోగా పూర్తిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని వ్యవసాయ అధికారులతో సర్వే పురోగతిపై శుక్రవారం సమీక్షించారు. సన్నరకం ధాన్యం పండిస్తున్న రైతులు బోనస్‌ను కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవా లని ఆదేశించారు. డీఏవో శ్రీనివాస్ ఉన్నారు.
వేగంగా అభివృద్ధి పనులు
కోల్‌సిటీ: అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తిచేయాలని మేయర్ మ హంకాళి స్వామి సూచించారు. శివాజీనగర్ కూ రగాయల మార్కెట్ వద్ద చేపట్టిన మెయిన్‌రో డ్డు పనులను శుక్రవారం పరిశీలించారు. 12, 13, 39, 44 డివిజన్లలో పర్యటించారు. కార్పొ రేటర్లు షేక్ బాబు మియా, డేవిడ్ రాజు, నాయకులు తిప్పారపు శ్రీనివాస్, చుక్కల శ్రీనివాస్, కాంట్రాక్టర్ కపాకర్‌రావు పాల్గొన్నారు.


