‘గుర్తింపు’పై గందరగోళం | - | Sakshi
Sakshi News home page

‘గుర్తింపు’పై గందరగోళం

Sep 19 2026 8:38 AM | Updated on Sep 19 2026 8:38 AM

● ఈనెల 8వ తేదీతోనే ముగిసిన గుర్తింపు కార్మిక సంఘం కాలపరిమితి ● ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి

గోదావరిఖని: సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం కాలపరిమితి ఈనెల 8వ తేదీతో ముగిసింది. ఈ నేప థ్యంలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహిస్తుందా? ప్రస్తుత గుర్తింపు కార్మిక సంఘాన్నే కొనసా గిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంటుందా? అ నేదానిపై కార్మిక వర్గాల్లో చర్చ జోరందుకుంది. 2023 డిసెంబర్‌లో జరిగిన సింగరేణి గుర్తింపు కార్మి క సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ గుర్తింపు, ఐఎన్‌టీయూసీ ప్రాతినిధ్య సంఘాలుగా విజయం సాధించాయి. వీటికి 2024 సెప్టెంబర్‌ 8న రెండేళ్ల కాలప రిమితితో గుర్తింపు ధ్రువీకరణ పత్రం అందజేశారు.

ఓటరు జాబితా, నోటిఫికేషన్‌ తర్వాతే.

గుర్తింపు కార్మిక సంఘం కాలపరిమితి ముగియడంతో తదుపరి ఎన్నికల ప్రక్రియపై సింగరేణి నిర్ణయం తీసుకోవాల్సిఉంది. ఇందుకోసం ఓటరు జాబితా, నోటిఫికేషన్‌, నామినేషన్లు, ప్రచారం, పోలింగ్‌ వంటి ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. దీనికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.

కొనసాగింపుపై చర్చ!

వెంటనే ఎన్నికలకు వెళ్లకుండా ప్రస్తుత పరిస్థితుల్లో గుర్తింపు కార్మిక సంఘం కొనసాగింపునకు అవకాశం కల్పిస్తారా? అనే చర్చ కూడా కార్మిక సంఘాల్లో జరుగుతోంది. దీనిపై సింగరేణి లేదా సంబంధిత అధికారుల నుంచి స్పష్టమైన నిర్ణయం వెలువడాల్సి ఉంది.

మళ్లీ పోరు తప్పదా?

ఎన్నికలు నిర్వహిస్తే సింగరేణిలో మరోసారి కార్మిక సంఘాల మధ్య హోరాహోరీ పోరు తప్పదు. రాజకీయంగా కూడా గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు ప్రాధాన్యత ఉండటంతో ప్రధాన కార్మిక సంఘాలు ఇప్పటికే తమ బలాబలాలను అంచనా వేసుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి తన స్థానాన్ని మళ్లీ నిలబెట్టుకోవడానికి ఏఐటీయూసీ ప్రయత్నించనుండగా, ఇతర సంఘాలు గుర్తింపు హోదా దక్కించుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.

సింగరేణిలో ఇప్పటివరకు నిర్వహించిన గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల వివరాలు

ఎన్నికలు విజేత కాలపరిమితి

09–09–1998 ఏఐటీయూసీ రెండేళ్లు

19–02–2001 ఏఐటీయూసీ రెండేళ్లు

13–05–2003 ఐఎన్‌టీయూసీ నాలుగేళ్లు

09–08–2007 ఏఐటీయూసీ నాలుగేళ్లు

28–06–2012 టీబీజీకేఎస్‌ నాలుగేళ్లు

05–10–2017 టీబీజీకేఎస్‌ ఆరేళ్లు

27–12–2023 ఏఐటీయూసీ గెలుపు

08–09–2024 గుర్తింపు పత్రం అందజేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement