చెరువుల కబ్జాపై సమరభేరి | - | Sakshi
Sakshi News home page

చెరువుల కబ్జాపై సమరభేరి

Sep 19 2026 8:38 AM | Updated on Sep 19 2026 8:38 AM

● వనరులపై తక్షణమే సర్వే చేయాలి ● ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌ హద్దులు తేల్చాలి ● అఖిలపక్ష ఉద్యమ నాయకుల డిమాండ్‌

పెద్దపల్లి : సుల్తానాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని చెరువులు, కుంటల పరిరక్షణకు పార్టీలకు అతీతంగా ఉద్యమం నిర్వహిస్తామని కాంగ్రెస్‌ కౌన్సిలర్లు గాజుల రాజమల్లు, ఉట్ల వరప్రదీప్‌, కాంగ్రెస్‌ మున్సిపల్‌ అధ్యక్షుడు వేగోళం అబ్బయ్యగౌడ్‌ తెలిపారు. సుల్తానాబాద్‌లోని కౌన్సిలర్‌ గాజుల రాజమ ల్లు స్వగృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో మాట్లాడారు. చెరువులు, కుంటలు కబ్జాకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వాటి పరిరక్షణకు మున్సిపల్‌ తీర్మానించి కలెక్టర్‌కు నివేదించిందని తెలిపారు. సుల్తానాబాద్‌ పెద్దచెరువు విస్తీర్ణం గతంలో 217 ఎకరాల 13 గుంటలు ఉండగా ప్రస్తుతం సుమారు 90 ఎకరాలకు తగ్గిపోయిందని పేర్కొన్నా రు. మిగిలిన భూమి కబ్జాకు గురైనట్లు వారు ఆరోపించారు. మున్సిపల్‌ పరిధిలోని 14 చెరువులు, కుంటలపై ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు సర్వే చేసి ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌ హద్దులు గుర్తించాలని డిమాండ్‌ చేశారు. కాలయాపన చేస్తే హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ నాయకులు గాదాసు రవీందర్‌, ఈర్ల శేఖర్‌, కల్వల ఓదెలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement